ప్రత్యేక హోదా మా ఊపిరి

హోదా సాధించే వరకు పోరాటం  కొనసాగుతుంది.
–అమిత్‌షా లేఖలోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి – 
వైయస్ జగన్ మోహన్ రెడ్డి

 ముఖ్యమంత్రిగారికి అమిత్ షాగారి లేఖ, దీనిపై ముఖ్యమంత్రిగారు అసెంబ్లీలో
స్పందించిన నేపథ్యంలో...వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు.

ఆ లేఖ పూర్తి పాఠం ఇదీ!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాగారు
రాసిన లేఖలో ‘‘ ప్రత్యేకహోదా వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలకు సమానంగా
ఉండే విధంగా ప్యాకేజీ రూపకల్పన జరిగింది. ప్యాకేజీని తమ ఘనతగా రాష్ట్ర
ప్రభుత్వం కూడా ప్రకటించుకుంది. 2 సంవత్సరాలు తర్వాత ఒక్కసారిగా
యూ టర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా పల్లవిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం
అందించిన, అమలుచేసిన ఆర్థిక హామీలతో ప్రత్యేక హోదా అంశం
ప్రస్తావనార్హం కాని అంశం అయినది’’ అని పేర్కొన్నారు.

ఈ లేఖలోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రత్యేక హోదా
రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేకమైన పారిశ్రామిక రాయితీలు ఇవ్వకుండా , రాష్ట్రం
అప్పులు 60 ఏళ్లలో రూ.97వేల కోట్లనుంచి నాలుగేళ్లలో రూ.2.25 లక్షల
కోట్లకు చేరాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా– ప్యాకేజీ ఏరకంగా
ప్రత్యేక హోదాకు సమానమని చెప్తారు? మీరు ప్రత్యేక హోదానుంచి
డీవియేషన్ కావడం ఏంటీ? ఈయన ఒప్పుకోవడం ఏంటీ? పైన పేర్కొన్నట్టు
ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు, 4ఏళ్లలో రూ.2.25లక్షల కోట్లకు చేరిన
అప్పులను దృష్టిలో పెట్టకోకుండానే, చంద్రబాబుగారు ప్యాకేజీకి
ఒప్పుకున్నారని చెప్పడంఏంటి?

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వచ్చే ప్రత్యేక పారిశ్రామిక
రాయితీలు, 100 శాతం ఇన్ కంటాక్స్  మినహాయింపు, జీఎస్టీ
మినహాయింపులు, కరెంటు ఛార్జీల్లో రిబేటు ... తదితర ప్రయోజనాలు ఎక్కడ
ఉన్నాయి? ఇవన్నీ లేకుండా కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నై,
తెలంగాణలోని హైదరాబాద్‌తో ఏవిధంగా పోటీపడతాం? ఈ నగరాలు
అభివృద్ధిచెందడానికి దాదాపు 60 ఏళ్లుపట్టిన విషయం మన అందరికీ
తెలియంది కాదు. ఈ ప్రత్యేకమైన రాయితీలు అన్నీ లేకపోతే ఒక ఐటీ హబ్ 
పెట్టాలన్నా, ఒక పరిశ్రమ పెట్టడానికైనా, ఒక పరిశ్రమ పెట్టడానికైనా, ఒక
హోటల్  పెట్టడానికైనా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను కాదని
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఎవరు వస్తారు? ఇవిరాకపోతే మనపిల్లలకు ఉద్యోగాలు
ఎలా వస్తాయి? ఈ రాష్ట్రాన్ని విడగొట్టేముందు అప్పటి అధికార, ప్రతిపక్షాలు
రెండూ ఒప్పుకుని, ప్రీ కండిషన్ గా, పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా
ఇస్తామని చెప్పి– రాష్ట్రాన్ని విభజించారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీతోపాటు
టీడీపీ కూడా చెప్పింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతిలో
మోడీగారు కూడా హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని బీజేపీ–టీడీపీ మేనిఫెస్టోలో
కూడా పెట్టారు.
ఇప్పుడు.. ఆం«ధ్రప్రదేÔౖఉæకు ఎంతో చేశామని బీజేపీ, ఏమీ చేయలేదని
చంద్రబాబు.... ఈ తరహా చర్చలోకి పోయేదానికన్నా... ప్రత్యేక హోదా వస్తేనే
మారాష్ట్రం బతకగలుగుతుంది. రాష్ట్రం విడిపోయేనాటికి దాదాపు
రూ.97వేలకోట్ల అప్పు ఉందని, ఈ నాలుగేళ్లలోనూ ఈ అప్పులు రూ.
2.25లక్షల కోట్లకు పెరిగాయని, ప్రత్యేక హోదాతో వచ్చే ప్రత్యేకమైన
పారిశ్రామిక రాయితీలు లేకుండా రాష్ట్రం బతకలేదని, మా పిల్లలకు
ఉద్యోగాలు రావన్న విషయాన్ని విస్మరించవద్దు.

ప్యాకేజీతో మోసం వద్దు – హోదా మా హక్కు – హోదాలేకపోతే మేం
బతకలేం. ప్రత్యేక హోదా అన్నది మా శ్వాస, మా ఊపిరి. అది లేకపోతే మా
రాష్ట్రం బతకదు. కాబట్టి, అవిశ్వాసం నుంచి రాజీనామాల వరకూ,
రాజీనామాల తర్వాతకూడా ప్రత్యేక హోదా వచ్చేదాకా మా పోరాటం
కొనసాగుతుంది. 

తాజా వీడియోలు

Back to Top