ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం

  • రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకుని వస్తాం
  • ప్రతి ఏటా ఎపిపిఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ 
  •  కావలి బహిరంగ సభలో జననేత వైయస్ జగన్ 


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాడతామని వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా ఏపిపిఎస్సి ద్వారా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రజలను మోసం చేస్తూ,అన్యాయానికి గురి చేసేలా దిక్కుమాలిన పాలన చేసే కంటే రాజాీనామా చేసి వెళ్లిపోవడమే మంచిదంటూ చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు.  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  నెల్లూరు జిల్లా కావలి లోని బోడగుడిపాడు లో శనివారం  జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న మోసం అన్యాయం గురించి ప్రజలకు వివరించారు. 

ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు

- పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి. 
- ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు అమ్మేశారు.
- ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయి.
- చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. 
- ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్నారు. 
- హోదాతో లాభం కంటే నష్టం ఎక్కువని సుజనా చౌదరి వ్యాఖ్యలు చేశారు. 
- కేసుల కోసం చంద్రబాబు భయపడి.. కేంద్రం ముందు సాగిలపడ్డారు. 
- రాజధాన్ని విదేశాల్లాగా చేస్తామని చంద్రబాబు గొప్పులు చెబుతున్నారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం, మన రాష్ట్రాన్ని దత్తత తీసుకుందని గొప్పులు చెబుతారు. బాబు విదేశాలకి ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తారు. 300-400 కోట్లు విదేశీ పర్యటనలకు ఖర్చు పెట్టారు. 
- చంద్రబాబు విదేశీ పర్యటనలంతా దోచుకున్న నల్లడబ్బు దాచుకోవటానికే. 
- తన అనుకూల మీడియా ఛానల్స్ లో విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్, ఎయిర్ బస్, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోందని కథనాలు ప్రసారం చేశారు.
-బడ్జెట్ సమావేశాలప్పుడు దుబాయ్ వెళ్లారు. బడ్జెట్ పై చంద్రబాబు ఇంతవరకు ప్రజల ముందుకు రాలేదు. 
- చంద్రబాబు విదేశీ పర్యటనలపై అనుకూల పత్రికల్లో అద్భుతం.. అని రాసేస్తారు. ఎమిరేట్స్ రాష్ట్రానికి వచ్చేస్తోందని పేపర్లలో రాసేస్తారని మండిపడ్డ వైయస్  జగన్.
- విశాఖలో సమ్మిట్స్ పెట్టేశారని.. ఐదు లక్షల కోట్లు వచ్చేశాయని ఒకసారి పది లక్షలు వచ్చేశాయని మరోసారి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 
- కేంద్ర సంస్థ డీపీఐఈ వద్ద ఐఈఎంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల డేటా ఉంటుంది. 31 డిసెంబర్ 2015 నాటికి రాష్ట్రానికి రూ.4,500 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చేశాయి. 31 డిసెంబర్ 2016 నాటికి రూ.10వేల కోట్లు, 31 డిసెంబర్ 2017 కేవలం రూ.4,400 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. 
- 15 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చేశాయ్. లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారు. 
- సినిమాల్లో 13 రీళ్ల వరకు విలన్ దే పై చేయి అని.. చివరకు హీరోదే అంతిమ విజయం.
- లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని  చంద్రబాబు భర్తీ చేయలేదు.
- జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఉన్న ఉద్యోగం నిలబడాలంటే బాబు పోవాలని ఉద్యోగస్తులు ఉన్నారు. 
- ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేస్తాం. 
- గ్రామస్థాయికి ఉద్యోగాలు తీసుకువస్తాం. 
- పైన చంద్రబాబు లంచాలు తీసుకుంటే.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా రెచ్చిపోతోంది. 
- గ్రామస్థాయిలో గ్రామ సెక్రటేరియట్ తీసుకువస్తాం. 
- చదువుకున్న 10 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. 
- ప్రతి సామాజిక వర్గం నుంచి ఉద్యోగాలు ఇస్తాం. 
- పింఛను, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్ .. ఇలా ఏదైనా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో మంజూరు చేస్తాం. 
- పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. 
 - బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోందని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగం బ్యారేజీకి నీరు తీసుకురావాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు.
- కృష్ణపట్నం పోర్టు వల్ల మత్య్సకారులు నష్టపోయారు. జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ తీసుకురావాలని వైయస్ఆర్ హయాంలోనే ప్రయత్నాలు మొదలు అయ్యాయి. ఫిషింగ్ హార్బర్ లేక మత్య్యకారులు వలసబాట పట్టారు. 
- కావలి ప్రభుత్వ హాస్పటల్ లో మౌలిక సదుపాయాలు లేవు, తగినంత సిబ్బందీ లేరు. 
- ఒకవేళ హైదరాబాద్ లో చూపించుకుంటే ఆరోగ్యశ్రీ కట్. 
- నవరత్నాలతో పేదవారి ముఖాల్లో చిరునవ్వు రావాలి. 
- చదువు వల్లే పేదవారి తలరాతలు మారతాయి. 
- పిల్లల ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తా. వారి బాధ్యత తనదంటూ నవరత్నాల్లో విద్య కోసం చేయబోయే కార్యక్రమాలను వివరించారు. 

Back to Top