బాబు మోసాలను తిప్పికొడదాం

హిందూపురం: 2019 ఎన్నికల్లో చంద్రబాబు మోసాలను తిప్పికొట్టి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు బాటలు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిందూపురం రూరల్‌ మండలం చెలివెందుల గ్రామ పంచాయతీ రచనపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందన్నారు. ప్రజలంతా వైయస్‌ జగన్‌ పక్షానే ఉన్నారన్నారు. చంద్రబాబు మోసాలను జనం గమనించారన్నారు. ఒక ఎన్ని ఎత్తులు వేసినా వైయస్‌ జగన్‌ ప్రజాధరణ ముందు పనికి రాదన్నారు. 
Back to Top