రైతుల మోముల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యం


  • రైతన్నకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
  • జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా


ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.  చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు, రైతాంగం నానా అవస్థలు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతుల మోముల్లో చిరునవ్వులు చిందేలా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని భరోసా ఇచ్చారు. 

 ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

- దివంగత మహానేత వైయస్ఆర్ ఉన్నట్లైతే ఈపాటికి సోమశిల ప్రాజెక్టు పూర్తై ఉండేది. ఈ నియోజకవర్గంలో, ఉదయగిరిలో మరో రిజర్వాయర్ తో కలుపుకుంటే మొత్తం 5 రిజర్వాయర్లతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారిపోయేది. 
- నాన్నగారు వెళ్లిపోయిన తర్వాత.. మిగిలిన పనులు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. 

- ఆత్మకూరు, వింజనూరు, కనిగిరి, తదితర మండలాల్లో తాగునీరు, సాగునీరుకు ఇబ్బందులు పడుతున్నారు. 
- పెన్నా డెల్టా ఆధునీకరణలో భాగంగా 80శాతం పనులు పూర్తైయ్యాయి. ఇప్పటికే నాలుగేళ్లు అయిపోయింది. మిగిలిన 20శాతం పనులు ఎక్కడేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయాయి. 

- నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశారు. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయంటూ బాబు కార్యకర్తలకు చెబుతున్నారు. 

- సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.. మనకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చేతులు వేసి కోరుతున్నా. 
- అభివృద్ధి అంటే.. నిన్నటి కన్నా ఇవాళ బాగుండటమే అభివృద్ధి అని శ్రీ వైయస్ జగన్ అన్నారు. మరి, ఇవాళ మనం బాగున్నామా? 
- అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ.
- రేషన్ షాపుల్లో ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదు. వైయస్ హయాంలో రూ.185లకే 13 రకాల నిత్యావసర వస్తువులు అందించేవారు. 

- ఇంట్లో ఆరు మంది ఉంటే.. ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదంటూ కటింగ్.. చేస్తున్నారు. 
- ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలయ్యాక ఒక్కమాట మీద నిలబడ్డారా? అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్.

- కరెంటు బిల్లులు షాక్ లు కొడుతున్నాయన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు భారీగా పెంచేశారని గుర్తు చేసిన శ్రీ వైయస్ జగన్.
- ఆర్టీసీ ఛార్జీలు వరుసగా మూడు సార్లు పెంచేశారని, పండుగలు వస్తే బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు. 
- దోచుకోవడమే చంద్రబాబు డిక్షనరీలో అభివృద్ధి అన్న శ్రీ వైయస్ జగన్
- దళారీలకు చంద్రబాబు నాయకుడు. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. 
- ఇంజనీరింగ్ చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు ముష్టివేస్తున్నట్లు ముప్ఫై, ముప్ఫై ఐదు వేలు ఇస్తున్నారు. 
- ముఖ్యమంత్రిగా నాన్నగారు ఉన్నప్పుడు పేదవారు ఏం చదవాలన్నా.. నేను చదివిస్తానని భరోసా ఇచ్చారు. 
- ఇంజనీరింగ్ చదివించాలంటే తల్లిందడ్రులు అప్పులు చేస్తే తప్ప పూర్తి కాని పరిస్థితి. 
- చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడకు పోవాలో తెలియని పరిస్థితి. లక్ష 20వేల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి సంవత్సరం భర్తీ చేయాలి. 
- కాస్తో కూస్తో ఉద్యోగాలు ప్రత్యేక హోదా ద్వారా వచ్చేవి. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ఇతర సంస్థలు వచ్చేవి. తద్వారా ఉద్యోగాల వెల్లువ వచ్చేది. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం రాలేదు. 
- ప్రత్యేక హోదా ద్వారా ఒక్క ఉద్యోగం రాకపోగా హోదాను చంద్రబాబు అమ్మేశారు. 
- నాన్నగారి పాలనో ఎవరికైనా బాగోలేదంటే.. 108కి ఫోన్ చేస్తే.. 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి పేదవాడిని తీసుకువెళ్లి ఉచితంగా వైద్యం చేయించి పంపేవారు. 
- చంద్రబాబు అభివృద్ధి .. అభివృద్ధి అంటున్నారు. మరి, 108కు ఫోన్ కొడితే అంబులెన్స్ వస్తోందా? డ్రైవర్లకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని సమాధానం వస్తోంది. అంబులెన్స్ లో డీజిల్ లేదని సమాధానం వస్తోంది. ఆరోగ్యం బాగోలేదని మంచి ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలంటే.. హైదరాబాద్ వెళ్లాలి. గుండెపోటు, న్యూరోసర్జరీ చేయించుకోవాలంటే హైదరాబాదే వెళ్లి వైద్యం చేయించుకోవాలి. హైదరాబాద్ వెళ్లి చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కట్ అట. మరి, ఆరోగ్యశ్రీ ఏ రకంగా జరుగుతోంది. ఇలాంటివి చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
- మూగ, చెవుడు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీలో సంవత్సరం తర్వాత రాపో.. అని సమాధానం ఇస్తున్నారు. ఇదా.. అభివృద్ధి చంద్రబాబూ.. అని శ్రీ జగన్ నిలదీశారు. 
- దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కడితే.. దేశంతో మహానేత వైయస్ఆర్ పోటీపడ్డారు. అభివృద్ధి అంటే ఏంటి చంద్రబాబు.. నాలుగేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా అని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు. లేదని ప్రజలు చేతులు ఊపారు. 
- అభివృద్ధి అంటే నిన్నటి కంటే ఇవాళ బావుండటమే అర్థం. నాలుగేళ్ల చంద్రబాబు పాలన గురించి మీరంతా గుండెలు మీద చేతులు వేసుకొని ప్రశ్నించుకోండని కోరారు. 
- బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారురుణాలు, వ్యవసాయ రుణాలు రద్దు కావాలంటే.. బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కానీ, బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయి. రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవటం లేదు. 
- ఆడవాళ్లను మోసం చేయాలంటే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను బాబు మోసం చేశారు. వారికి ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టకపోవటంతో సున్నా వడ్డీ రావటం లేదు. 
- జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే.. రూ.2వేలు ఇస్తామన్నారు. 
- చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం రావాలి. నిజాయితీ అనే పదం రావాలి. మైక్ పట్టుకొని ఫలానా చేస్తానని రాజకీయ నాయకుడు చెబితే.. చేయకపోతే రాజీనామా చేసే పరిస్థితి రావాలి. 

- పెద్దమనిషి చంద్రబాబు మనల్ని మోసం చేయటం కోసం.. నాలుగు అడుగులు ముందుకు వేసి.. రైతుల రుణాలు బేషరుతుగా మాఫీ, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామంటే నమ్మరని.. పై స్థాయికి వెళ్తారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా అని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు. లేదంటూ ప్రజలు చేతులు ఊపారు. 

- ప్రతి ఇంటికి వచ్చి ఓటుకు మూడువేలు పెట్టే కార్యక్రమం చేస్తారు. డబ్బు ఇస్తానంటే తీసుకోండి. ఆ డబ్బు మనది. ఇంకా ఐదు వేలు ఇచ్చిన తీసుకోండి. మనల్ని దోచేసి ఆ సొమ్ము చంద్రబాబు సంపాదించారు. కాబట్టి.. ఎవ్వరూ వద్దు అనొద్దు. ఖచ్చితంగా తీసుకోండి. ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో.. అలా బుద్ధి చెప్పండని శ్రీ వైయస్ జగన్ కోరారు.
-  మీరందరూ   తోడుగా ఉన్నప్పుడు విశ్వసనీయత అన్నది సాధ్యమౌతుంది. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నామో.. నవరత్నాల్లో తెలిపాం. నవరత్నాల్లో మార్పులు చేర్పులు ఏమన్నా.. చేయాలంటే.. సూచనలు ఇవ్వమని ప్రజలను కోరారు. 
-రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా మే మాసంలో రూ.12, 500 అందజేస్తాం. లక్ష వరకు వడ్డీలు లేకుండా రుణాలు వచ్చేవి. లక్ష నుంచి మూడు లక్షల వరకు పావలా వడ్డీకే రైతులకు రుణాలు వచ్చేవి. ప్రతి రైతన్నకూ వడ్డీలు లేకుండా రుణాలు ఇప్పిస్తాం. ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయిస్తుంది. రైతన్న కష్టపడ పండించిన పంట అమ్ముకోవటానికి గిట్టుబాటు ధరలు రాక ఇబ్బందిపడుతున్నారు. దళారీలు తక్కువకే కొంటున్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకువస్తాం. తద్వారా రైతన్నల ముఖంలో చిరునవ్వులు చూస్తాం. 
- కరువు, అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రతి రైతన్నకు భరోసా కల్పిస్తాం. రూ.4వేల కోట్లతో విపత్తు నిధిని ఏర్పాటు చేస్తాం.
Back to Top