వైయ‌స్ఆర్ హ‌యాంలో పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందాయ‌ని రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విస్మ‌రించ‌డం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ల‌క్కిరెడ్డిప‌ల్లె మండల ప‌రిష‌త్ కార్యాలయంలో ఎంపీపీ అంబాబత్తిన రెడ్డెయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్యా సమావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ...ప్రస్తుతం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు పింఛన్లు పొందాలంటే ఓ అధికార పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి ఆయన చేతులు పట్టుకొని అడ్డుకోవాల్సిన దుస్థితి నెలకొందంటే ఇంతు దుర్మార్గమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హ‌యాంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు వంటి అనేక సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందిచామన్నారు. నేడు అధికారులు ఈ పార్టీ నాయకులకు వత్తాసు పలకడంతో వారు చెప్పిందే శాసనంగా చాలా గ్రామాలలో భర్తలు బ్రతికున్నా, వయస్సు తక్కువగా ఉన్నా, అంగవైకల్యం లేకపోయిన పింఛన్లు పొందుతున్న విషయం ఈ మధ్య కాలంలో జరిగిన సామాజిక తనిఖీలో బట్టబయలు చేశార‌న్నారు. కరువుప్రాంతం కావడంతో రైతులు కూడా పనుల కోసం వలసలు వెళ్లుతున్నారని తక్షణమే ఉపాధి ద్వారా పనులు కల్పించాలని ఏపీఓ సుధారాణికి ఆయన సూచించారు. అంగ‌న్‌వాడి సెంటర్‌లో పిల్లలకు సకాలంలో పౌష్టికాహారంతో పాటు కోడి గుడ్డలను సకాలంలో పంపిణీ చేసేవిధంగా చూడాన్నారు.

తాజా వీడియోలు

Back to Top