నవరత్నాలతోనే పేదల సంక్షేమం

దోమాడ (పెదపూడి) :  వైయ‌స్ఆర్ కుటుంబం, న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌తోనే పేద‌ల సంక్షేమం సాధ్యం అవుతుంద‌ని జిల్లా అధికారప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి తెలిపారు. దోమాడ గ్రామంలో వైయ‌స్ఆర్ కుటుంబం, న‌వ‌ర‌త్నాలు కార్య‌క్రమాన్ని  168 బూత్‌ పరిధిలో బూత్‌ కన్వీనర్, గ్రామ ఉపసర్పంచి చీపూరి శ్రీనివాస్  ఆధ్వ‌ర్యంలో శుక్రవారం నిర్వహించారు. వైయ‌స్ఆర్ కుటుంబం, నవరత్నాల సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.  అనంత‌రం కృష్ణారెడ్డి మాట్లాడుతూ మిస్ట్‌కాల్‌ ద్వారా పార్టీ సభ్యత్వం పొందే వేసులుబాటు అందుబాటులో ఉన్నందున అవకాశాన్ని వినియోగించుకునేలా చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. నవరత్నాలు పథకం ద్వారా దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  సువర్ణయుగం మ‌ళ్లీ ఖ‌చ్చితంగా వ‌స్తుందనే ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top