సంక్షేమమే ఆయన ఆశయం

ఆలోచన ఆయన వ్యక్తిత్వం, మంచితనం
ఆయన మాట. చిరునవ్వు ఆయన పలకరింపు. నిండైన
తెలుగురూపం, తెగువకు నిలువెత్తు ప్రతిరూపం
వైయస్ రాజశేఖర్ రెడ్డి. శతృవునైనా మన్నించే గుణం ఆయనకే
సొంతం. ఆయన నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. వాటికి
కట్టుబడి ఉంటారు. ప్రజలకు ప్రయోజనం అని అనిపిస్తే
చాలు ఆయన అడుగులు ముందుకే పడతాయి. మీమాంశలు లేవు. సందిగ్ధతలు
లేవు. సంకల్పించడం, ఆచరించి చూపించడం. ఆయన
ప్రతి నిర్ణయం ఓ మిసైల్ లా దూసుకుపోయింది. విమర్శలను
తుత్తినీయలు చేసింది. ప్రజల మన్ననలు అందుకుంది. వైయస్ ఆర్ సంక్షేమానికి బ్రాండ్
నేమ్.  వైయస్ఆర్  ప్రజల నాడి తెలిసిన డాక్టర్ సిఎమ్.

సంక్షేమ
పథకాలు

పేదలకు
ఇళ్లు, పెన్షన్లు, పావలావడ్డీ రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల జారీ, పేద విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్మెంట్, జలయజ్ఞం, 108, 104 సర్వీసులు, కిలో 2రూ. బియ్యం, ట్రిపుల్ ఐటిల ఏర్పాటు, రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు ఒకటా
రెండా వైయస్ఆర్  ఆలోచనల్లో ప్రతి వర్గానికీ
ప్రయోజనం ఉండాలనే ఆకాంక్ష ఉండేది.
అందరికీ అనువైన పథకాలు
ప్రజల గడపల్లోకి వచ్చాయి.
పథకాలను ప్రకటించడమే
కాదు వాటి అమలునూ పర్యవేక్షించేవారు వైయస్ఆర్. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవ్వాలని
అధికారులను ఆదేశించేవారు.
ఇది ఆయన పెద్దమనసుకు
నిదర్శనం.

రైతు
బాంధవుడు

రైతును
రాజును చేయాలనుకున్నారు వైయస్ఆర్.
ప్రతి ఎకరాకూ నీరు
అందాలంటూ జలయజ్ఞం చేపట్టారు.
ఆయన ఆశయమే అకుంఠిత
దీక్షగా రూపుదాల్చి ప్రాజెక్టులు పరవళ్లు తొక్కాయి. ఉచిత విద్యుత్ తో రైతుల జీవితాల్లో వెలుగులు
నిండాయి. వేల కోట్ల పంట రుణాల భారం ఒక్క
సంతకంతో దూదిపింజె అయ్యిపోయింది.
సాగుకు 450కోట్ల రాయితీలు అందించిన ఘనత వైయస్ఆర్
ది. 1998 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతు
కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి,
రైతు కుటుంబానికి
ఆసరాగా నిలిచారు వైయస్.
రైతులను పీల్చి పిప్పి
చేసే వడ్డీ వ్యాపారులపై కొరడా ఝుళిపించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రతి జిల్లా
కేంద్రంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసారు. వ్యవసాయం
దండగ అన్న మునుపటి హైటెక్ పాలకుడి సిద్ధాంతాన్ని మార్చి వ్యవసాయం పండుగ అనేలా చేసిన
ఘనుడు వైయస్.
30లక్షల వ్యవసాయ
పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అధికారంలోకి
వచ్చిన రోజే వ్యవసాయ విద్యుత్ బకాయిలు రద్దు చేసారు. 

వైయస్ఆర్
ఆశయాలు

ప్రతి
ఆడబిడ్డా లక్షాధికారి కావాలి.
మహిళలకు ఆర్థిక స్వావలంబన
ఉండాలి అన్నది వైయస్ఆర్  తాపత్రయం. అందుకే పావలవడ్డీ రుణాలు ఇచ్చి అక్కచెల్లెళ్లకు
అండగా నిలిచారు వైయస్.
పూటగడవని పేద గుడిసెలో
ఒక్కరు అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఛిద్రం అవుతుందని ఓ డాక్టరుకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి ఉచితంగా కార్పొరేట్
వైద్యం అందింది.
మెరుగైన వైద్యం ప్రతిమనిషి
హక్కు అని నమ్మిన వైద్యుడు కనుకనే ఆరోగ్యశ్రీ పథకాన్ని అంతకంతకూ మెరుగులు దిద్దారు
వైయస్ఆర్. ఆసుపత్రికి వచ్చి వెళ్లేందుకు
ప్రయాణ ఖర్చులు సైతం అందించడం పేదల పరిస్థితుల పట్ల ఆయన సునిసిత దృష్టికి నిదర్శనం. లక్షలాది విద్యార్థులు వైయస్ఆర్ ప్రవేశ
పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా పెద్ద చదువులు చదివారు. పేదవాడికి పెద్ద చదువులు అన్నది ఆయన ఆశయాల్లో
మరో ముఖ్యమైన అంశం.
నిరు పేదపిల్లలు
ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలో ఆపేయడాన్ని చూసి చలించిపోయిన వైయస్ ప్రవేశ పెట్టిన
పథకమే ఫీజ్ రీయంబర్స్ మెంట్.
పిల్లల చదువులకయ్యే
ఫీజులను పూర్తిగా ప్రభుత్వం చెల్లించడమనే సాహసోపేత నిర్ణయం బడుగు విద్యార్థిలపాలిట
వరమైంది. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్ మెంట్ తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు
అభ్యసించే పేద విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ వర్తింప చేసారు. 11లక్షల బలహీన వర్గాల కుటుంబాలు, 5లక్షల ఎస్సీ కుటుంబాలు, 1.8లక్షల గిరిజన కుటుంబాలు, 7.5లక్షల మైనారిటీ కుటుంబాలు ఈ పథకం
కింద లబ్ది పొందాయి.
పల్లె పట్నం తేడా
లేకుండా ఆపదలో ఆదుకున్న ఆపద్బంధు 108. వైయస్ఆర్
మానసపుత్రిక 108
అని అందరూ చెప్పుకోవడంలో
అతిశయోక్తి లేదు.
లక్షల మందికి ప్రాణదానం
చేసిన అపర సంజీవని ఈ పథకం.

వైయస్
ఆర్  ఏది ఆలోచించినా పేదలకోసమే. ఆయన ఆశయాలు బడుగు, బలహీన వర్గాల ప్రయోజనమే. ఆయన పాలసీ ఎప్పుడూ ప్రజా సంక్షేమమే. 

 

తాజా వీడియోలు

Back to Top