దుర్గేష్‌ నియామకంపై హర్షం

తూర్పు గోదావ‌రి:  గ్రేటర్‌ రాజమహేంద్రవరం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంపై కడియం మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుర్రిలంకలో మాజీ సర్పంచ్‌ గట్టి నరసయ్య ఇంటివద్ద బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వెలుగుబంటి అచ్యుతరామ్, మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య, మాజీ సర్పంచ్‌లు నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, నాయకులు విప్పర్తి ఫణికుమార్, ముద్రగడ జెమి తదితరులు మాట్లాడుతూ సిటీ, రూరల్‌ నియోజకవర్గాలపై మంచి పట్టున్న దుర్గేష్‌ను అధ్యక్షుడిగా నియమించడం వల్ల పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై దుర్గేష్‌ సారథ్యంలో సమైక్యంగా పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. మాజీ ఉప సర్పంచ్‌లు తోరాటి శ్రీనివాసరావు, పంతం గణపతి, స్థానిక నాయకులు ఈలి గంగారావు, వరదా నూకరాజు, తూపాటి చిన్న, పల్లి చిన్న, ముంగమూరి చినబాబు, నర్సరీ అసోసియేషన్‌ డైరెక్టర్లు పాటంశెట్టి బుజ్జిబాబు, సుంకర గోవింద్‌, బ్యాంక్‌ డైరెక్టర్‌ రత్నం విజయ్, పాటంశెట్టి దొరబాబు, గాద సాయి, అబ్బులు, ఏకే రాజు, నాగిరెడ్డి దొరబాబు, ముత్యం జగదీష్, పాటంశెట్టి శ్రీనివాసరావు, గట్టి దుర్గారావు, రత్నం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Back to Top