చంద్రబాబు దమ్ము ధైర్యం ఉందా..!

హైదరాబాద్) చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాజీనామా చేయించలేక పోతే, అనర్హులుగా చేయించాలని కోరారు. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళదామని, అక్కడే తేల్చుకొందామని సవాల్ విసిరారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఒక్కొక్కటిగా విశ్లేషించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

       ఏవి కనిపించినా నావే అంటున్నారు. 40 వేల కోట్లు పైగా ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. అందులో పావలా వంతు నాకు ఇవ్వండి. ఎక్కడ సంతకం పెట్టమన్నా సంతకం పెట్టేస్తాను. ఇప్పుడే చెబుతున్నా. అసెంబ్లీ కూడా నాదే అని అనేట్లుగా ఉన్నారు. అసెంబ్లీ లో పావలా వంతు ఇవ్వండి మీకు సంతకం పెట్టి ఇస్తాను. 
Back to Top