చేనేత రంగం నిర్వీర్యం

ప్రకాశం: బీజేపీ, టీడీపీ పాలనలో చేనేత రంగం నిర్వీర్యమైందని చేనేత కార్మికులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 108వ రోజు చీరాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. వేటపాలెం గ్రామంలో చేనేత కార్మికులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రకాశం జిల్లాలో 70 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారని వారు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. చేనేతలకు నివాస స్థలాలు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని చెప్పుకున్నారు. పవర్‌లూమ్స్‌ రావడంతో ఉపాధి కోల్పొతున్నామని చెప్పారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేతలు మేలు పొందారన్నారు. మహానేత పాలనలో 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చారన్నారు. విద్యా, వైద్యం, సంక్షేమం వంటి సమస్యలపై వైయస్‌ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు విన్న జననేత మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని అందరికీ మేలు జరుగుతుందని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు
 
Back to Top