నేతన్నకు అండగా..

చేనేత కార్మికులను పరామర్శించిన వైయస్‌ జగన్‌
నేతన్న రామస్వామి ఇంట్లో మగ్గం నేచిన జననేత
వైయస్‌ జగన్‌కు చేనేతల అపురూప కానుక
పట్టువస్త్రంపై నవరత్నాలు నేచిన కార్మికులు

గుంటూరు: చేనేత కార్మికులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపురూపమైన కానుకను బహూకరించారు. పట్టువస్త్రంపై నవరత్నాలను నేచి వైయస్‌ జగన్‌కు అందించారు. మంగళగిరి నియోజకవర్గం కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో చేనేతలు వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. అంతకు ముందు ఆత్మకూరు గ్రామంలోని చేనేత కార్మికుల కుటుంబాలను జననేత పరామర్శించారు. చేనేత కార్మికుడు రామస్వామి ఇంటికి వెళ్లి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మగ్గం నేశారు. 
బతుకుపై ధైర్యం వచ్చింది..
ఈ సందర్భంగా జననేతను కలిసిన నేతన్నలు మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయం తరువాత చేనేత రంగానికి అధిక ప్రాధన్యం ఉందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చేనేత కార్మికులను మోసం చేసిందని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ 45 సంవత్సరాలకే రూ. 2 వేల పెన్షన్‌ అందిస్తామనడం, చేనేతలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆశాజనకంగా ఉందన్నారు. నాలుగు సార్లు చేనేతల సదస్సు నిర్వహించిన వైయస్‌ జగన్‌ నేతన్నలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో బతుకుపై ధైర్యం వచ్చిందన్నారు. గతంలో చేనేతలపై జీఎస్టీ మినహాయించాలని వైయస్‌ జగన్‌ కేంద్ర మంత్రికి లేఖ సైతం రాశారని గుర్తు చేశారు. 
బాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు
చేనేతల సంక్షేమానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్ల కేటాయిస్తామన్న చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదని వారు మండిపడ్డారు. ఆరోగ్యబీమా, జనతా బజార్, సెంటున్నర స్థలంలో ఇల్లు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో ప్రజల్లో ధైర్యం వచ్చిందన్నారు. నవరత్నాలతో నేచిన పట్టుశాలువాను 13 జిల్లాలకు పంపిస్తామన్నారు. 
 
Back to Top