చేనేతల సమస్యలపై కేంద్రానికి లేఖ రాస్తాం

  • బాబుకు కార్మికుల గోడు పట్టడం లేదు
  • వైయస్ జగన్ ను కలిసిన నేతన్నలు
  • జీఎస్టీ బాదుడుపై ఏకరవు
  • మినహాయింపునిచ్చేలా కృషి చేస్తానన్న వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లాః అసలే అవస్థల్లో ఉన్న చేనేత రంగానికి కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ అమలు వల్ల మరింత పెద్ద దెబ్బ తగులుతుందని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. జిల్లా పర్యటనలో ఉన్న వైయస్ జగన్ ను చేనేత కార్మికులు కలుసుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ....చేనేత కార్మికులకు సంబంధించి నూలు మీద 5శాతం, బట్ట తయ్యారక కూడ జీఎస్టీ 10శాతం ఇంపోజ్ చేయడం బాధాకరమన్నారు. అసలే చేనేత బట్టలకు సరైన రేటు రాని పరిస్థితిల్లో వారిపై అదనపు భారం వేయడం తగదన్నారు. 

చేనేత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ భారం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ఈరోజే లేఖ రాస్తామని వైయస్ జగన్ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడ చేనేతల గురించి అడగకపోవడం, జీఎస్టీ కౌన్సిల్ లో యనమల రామక్రిష్ణుడు మెంబర్ గా ఉండి కూడ చేనేతల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. తాము కేంద్రానికి రాసే లేఖతోనైనా బాబుకు ఆ దేవుడు బుద్ధిని ప్రసాదించి ఆయన కూడ కేంద్రానికి లేఖ రాసేలా చూడాలని కోరారు. కార్మికులు పెట్టే గడ్డితోనైనా బాబుకు బుద్ధి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 
Back to Top