వైఎస్‌ఆర్‌సీపీని బలోపేతం చేయడమే లక్ష్యం

చిత్తూరు:  పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులు పొందిన నేతలు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజారెడ్డి తదితరులను మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, ఎంపీపీ నరసింహులు, స్థానిక నేతలు ఫకృద్ధీన్‌షరీఫ్, కౌన్సిలర్లు కలసి నూతనంగా పార్టీ కార్యదర్శులుగా నియమితులైన వారందరినీ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే  డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిల అండదండలతో  పుంగనూరులోని నేతలకు రాష్ట్ర పార్టీలో అగ్రస్థానం లభించిందని కొనియాడారు. రాష్ట్ర నేతలుగా నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డెప్ప మాట్లాడుతూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు.సమావేశంలో ఎంపీపీ నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మాజీ చెరుకు అబివృద్ధి మండలి అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, స్థానిక పార్టీ నేతలు కొండవీటి నటరాజ, ఫకృద్ధీన్ షరీఫ్, విజయభాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రీహo,  త్యాగరాజు, సయాజ్,  ఖాదర్‌బాషా, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top