చేనేత‌ల‌కు అండ‌గా ఉంటాం

వెంకటగిరి: నిరుపేద చేనేత కార్మికులంద‌రికీ అండ‌గా ఉంటామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు, ఎన్‌విఆర్‌ ఛారిటబుల్‌ట్రస్టు అధినేత నక్కా వెంకటేశ్వరరావు తెలియజేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన నిరుపేద చేనేత కార్మికుడు తుమ్మలచర్ల మునెయ్య శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యులను వెంకటేశ్వరరావు పరామర్శించి అంత్యక్రియలకోసం ఆర్థిక సాయం అంద‌జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతపనులు తప్ప ఇతర వృత్తులు చేనేత కార్మికులు ఆర్ధికసంక్షోభంంలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేనేతలకు ఫించన్‌లు , సబ్సీడీ రుణాలు, పక్కా గృహలవంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top