అంగన్‌వాడీలకు అండగా ఉంటాం

వెదురుకుప్పం: చంద్రబాబు పాలనలో పేదల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకూ అన్ని వర్గాల వారు నరకాన్ని అనుభవిస్తున్నారని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే. నారాయణస్వామి ఆరోపించారు. వారం రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న అంగన్‌వాడి కార్యకర్తలు సోమవారం మండలంలో ఎమ్మెల్యే నారాయణస్వామికి తమ గోడును వినిపించారు. సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈసంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ....ఆది నుంచీ చంద్రబాబుకు అంగన్‌వాడీ కార్యకర్తలంటే చిన్న చూపేనని మండిపడ్డారు. అంగన్ వాడీలను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిదంగా తమ సమస్యలతో పాటు డిమాండ్లను నెరవేర్చేందుకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అలాగే ఇప్పటి వరకూ రావాల్సిన బకాయిల మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు.  ప్రస్తుతం తాము డిమాండ్‌ చేస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అంగన్‌వాడి వర్కర్లపై వివక్ష చూపుతుందని తెలిపారు. అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్‌సీపీ పోరాటాలు చేసేందుకు సిద్దంగా ఉండి అండగా నిలస్తామన్నారు. ఎక్కడికి రమ్మన్నా జిల్లా అధ్యక్షుడిగా ఏ ఉద్యమానికైనా వెనకాడబోమన్నారు. వారం రోజులుగా రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు.

–ఆర్డీవో తొత్తుగా వ్యవహరిస్తున్నారు...
చిత్తూరు ఆర్డీవో కోదండరామిరెడ్డి టీడీపీకి తొత్తుగా పనిచేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే నారాయణస్వామి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. చౌకదుకాణాల డీలర్ల ఎంపికలో అధికార పార్టీ వారతో లాలూచీ పడి నింబంధనలు తుంగలోతొక్కి ఏకపక్షంగా వ్యవహరించారనిఆరోపించారు. ఒక్కవెదురుకుప్పం మండలంలోనే కాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ డీలర్ల నియామకంలో చేతివాటాన్ని చూపినట్లు చెప్పారు. వెదురుకుప్పం మండలంలో గతంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చినట్లు గుర్తు చేశారు. భూమి ఒకరిదైతే ఆన్‌లైన్‌లో మరొక పేరు నమోదు చేసి అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయక పోతే రైతులు తీవ్ర స్థాయిలో నష్ట పోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలో రెవిన్యూ సదస్సును నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ బీసీసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టె సుబ్రమణ్యం, సర్పంచ్‌ సంఘ అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌ మునికృష్ణారెడ్డి నాయకుడు రామ్మూర్తి పాల్గొన్నారు.

Back to Top