తెలంగాణలో పటిష్టపరుస్తాం..!

 బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు

వైయస్సార్ ఆశయాల కోసం నిత్యం పోరాడుతాం

అన్ని అనుకూల వర్గాలను ఏకతాటిపైకి తెస్తాం...గట్టు

గట్టుకు పలువురి నేతల శుభాకాంక్షలు 

హైదరాబాద్ః రానున్న రోజుల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలీయమైన
శక్తిగా తయారు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వైయస్సార్సీపీ అధ్యక్షులు గట్టు
శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి
నిలబెట్టిన కార్యకర్తల బలంతో, తమ అధ్యక్షులు వైఎస్ జగన్ వెంట ఉన్న బలమైన శ్రేణులతో పార్టీని బలీయశక్తిగా
రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్  లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇవాళ
బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షులు వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా
రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈకార్యక్రమంలో తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గట్టు శ్రీకాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.  శ్రీకాంత్ రెడ్డితో పాటు కొత్తగా నియమించిన నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రెహ్మాన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. 

ఈసందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.... పార్టీ తెలంగాణ రాష్ట్ర
అధ్యక్షునిగా తనను నియమించిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ తనపై
ఉంచిన ఈ నమ్మకాన్ని,
బాధ్యతను
నిలబెట్టుకుంటానని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి
సమయాన్ని వెచ్చించి...వైఎస్సార్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహానేత
అభిమానులను కూడగడుతామన్నారు. అన్ని అనుకూల వర్గాలను ఏకతాటిపైకి తెస్తామన్నారు.
వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని పార్టీలకు దిక్సూచిగా నిలిచాయని
గట్టు తెలిపారు. వాటి అమలు కోసం నిత్యం పోరాడుతామన్నారు. అందరిని సమన్వయం
చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానన్నారు.  

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆశయాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలతోనే
ముడిపడి ఉన్నాయని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్
తెలిపారు. వైఎస్సార్ ఆశయాల కోసం వైఎస్ జగన్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, రానున్న రోజుల్లో  సీమాంధ్రలో పార్టీ
అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. తమ కెప్టెన్ శ్రీకాంత్ రెడ్డి  కూడా
వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడిస్తే...  తెలంగాణలో పార్టీ అభివృద్ధి చెందడానికి
అవకాశం ఉంటుందని చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి రానున్న రోజుల్లో పార్టీని తిరుగులేని
శక్తిగా ముందుకు తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన
కార్యదర్శులు శివకుమార్,
రహమాన్
తెలిపారు. 

 To read the article in English:  http://bit.ly/1q90B33

 

Back to Top