'గిరిజనులను చంద్రబాబు అవమానించారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరీ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా దళిత గిరిజన ఎమ్మెల్యేలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అంతు చూస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 420లు అని అన్న బోండా ఉమామహేశ్వరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం అని అన్నారు.

ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్బండ్పైన అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేపట్టి ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్పీకర్ సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి పక్షం లేకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమను అసెంబ్లీలోనే పాతేస్తామంటూ హెచ్చరించినా వారిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే విషయాన్ని మరిచిపోయి టీడీపీ సమావేశాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గిరిజనులపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top