రానున్న ఎన్నికల్లో సత్తా చాటుదాం

విజయనగరం(సీతానగరం): పార్వతీపురం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నుంచి నాయకులు పార్టీమారినా కార్యకర్తలు చెక్కుచెదరలేదని, వారే పార్టీకి అండ అని పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి గర్భాపు ఉదయభాను అన్నారు. సీతానగరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సీపీ నుంచి నాయకులు కొంతమంది ఇతర పార్టీకివెళ్లినప్పటికీ  క్షేత్రస్థాయిలో మహానేత వైయస్‌ఆర్‌ అభిమానులు, వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారన్నారు. 

గ్రామాల్లో పార్టీ చెక్కు చెదర లేదని, పార్టీని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని నమ్ముకున్ననాయకులకు, కార్యకర్తలకు జిల్లా నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనల మేరకు అండగా ఉంటామన్నారు. తామంతా పార్టీని బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో సత్తాను నిరూపించుకుంటామని అన్నారు. మండల నాయకులు జి లక్ష్మణరావు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని పటిష్ట పర్చడానికి గ్రామ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గసభ్యులు కేతిరెడ్డి రాఘవకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Back to Top