పార్టీ పటిష్టతకు కృషి చేస్తా

కంభం : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా వాణిజ్యవిభాగం జనరల్‌ సెక్రటరీగా నూతనంగా ఎంపికైన గర్రెవెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక వైయస్సార్‌సిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు అవకాశం ఇచ్చిన ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేనిశ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఐవి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టిని బలోపేతం చేస్తానన్నారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. సమావేశంలో మండల కన్వీనర్‌ లాయర్‌ శ్రీనివాసులరెడ్డి, మాజీ జెడ్పీటిసి సూరాబాలిరెడ్డి, నాయకులు బొగ్గురామచంద్రారెడ్డి, ఆదినారాయణరెడ్డి, సూరాబాలిరెడ్డి, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Back to Top