అక్టోబర్ 1లోపు నీరివ్వకపోతే నిరాహార దీక్ష చేస్తాం

వైయస్ఆర్ జిల్లాః దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఏనాడూ రైతులు సాగునీరు కోసం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయలేదని వైయస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఇదే మైదుకూరులో సాగు నీరు కోసం రైతులు మూడు సార్లు ధర్నాలు చేశారన్నారు. శ్రీశైలం జలాశయంలో కొద్దిపాటి నీరు వస్తూనే ఐఏబీ   (ఇరిగేషన్‌ అడ్వైజ్‌ బోర్డు మీటింగ్‌) పెడతారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 864.3 అడుగులు నీరు వచ్చినా ఇంత వరకు ఐఏబీ మీటింగ్‌ పెట్టలేదు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఐఏబీ మీటింగ్‌ పెట్టి కేసీ ఆయకట్టుకు నీరు ఇచ్చే అంశంపై సరైన సమాధానాన్ని రైతులకు ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అక్టోబర్‌ 1వ తేది వరకు గడువు ఇస్తున్నాం. కేసీ ఆయకట్టుకు నీరు అందించే విషయంపై స్పష్టత ఇవ్వకపోతే అక్టోబర్‌ 2 ఉదయం నుంచి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top