నంద్యాల గెలుపును జననేతకు కానుకగా ఇస్తాం

కర్నూలుః నంద్యాల ఉపఎన్నికను గెలిచి వైయస్ జగన్ కు బహుమతిగా ఇస్తామని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. టీడీపీ సహా ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నంద్యాలలో సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి, వైయస్సార్సీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ...టీడీపీని ఎందుకు వీడాల్సివచ్చిందో వివరించారు. తెలుగుదేశం పార్టీ తనను ఘోరంగా అవమానించిందని చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రికి పంపించినట్టు చక్రపాణిరెడ్డి తెలిపారు.  సాయంత్రంలోగా వైయస్ జగన్ ను కలవనున్నట్టు చెప్పారు. రేపటి బహిరంగసభలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి వైయస్సార్సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. 

టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడ తమపై విమర్శలు చేస్తున్నారు.  ఇష్టారాజ్యంగా వ్యక్తిగత దూషణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని చక్రపాణిరెడ్డి హెచ్చరించారు. రాజీనామాను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. దమ్ముంటే రండి అందరం రాజీనామా చేద్దాం. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా మేమేంటో చూపిస్తామనని సవాల్ విసిరారు. మంత్రి అఖిలప్రియ సహా టీడీపీ నేతల చరిత్రంతా బయటపెడతానని చక్రపాణిరెడ్డి అన్నారు. ఏవిధంగా అవకతవకలకు పాల్పడ్డారో త్వరలోనే చెబుతానన్నారు.

చీమకు కూడ హాని తలపెట్టని వ్యక్తిత్వం శిల్పా బ్రదర్స్ దని అన్నారు. తాము ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పార్టీ బలోపేతం కోసం పనిచేశామన్నారు. వైయస్సార్సీపీని కర్నూలులో బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని ఫరూక్ మాట్లాడుతున్నారని..మరి ఆయన, ఎస్పీవై రెడ్డి నంద్యాల ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఎలక్షన్లు వచ్చాయంటే డబ్బులిచ్చి మనుషులను పెట్టుకొని దుష్ర్పచారం చేయించడం ఫరూక్ కు అలవాటైపోయిందని శిల్పా ఎద్దేవా చేశారు.  

Back to Top