చర్చ జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం

ఢిల్లీ:

లోక్‌సభలో ప్రత్యేక హోదాపై చర్చ జరిగేంత వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూనే ఉంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోతే పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడిన వెంటనే ఎంపీలమంతా రాజీనామా చేస్తామని వరప్రసాద్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతుంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు. మాతో సహా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. రాజీనామాలు చేస్తే మేనిఫెస్టోలో పెట్టి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న వారి రంగులన్నీ బయటపడతాయన్నారు. హోదా, విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు వస్తే చిత్తూరు జిల్లా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్‌ ఇస్తే పోర్టు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, పోర్టు వస్తే దాదాపు రూ. 10 వేల కోట్లతో చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. 

Back to Top