టీడీపీ నేతల అక్రమ నియామకంపై న్యాయపోరాటం చేస్తాం

  • రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన సలహా మండలి ఏర్పాటు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాని వారిని కమిటీలో నియామకం
  • ప్రభుత్వంపై మండిపడ్డ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర
అమరావతిః గిరిజన సలహా మండలి నియామకం గందరగోళంగా మారింది. వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటంతో ఎట్టకేలకు గిరిజన సలహామండలి ఏర్పాటు అయ్యింది. ఐతే, మండలి నియామకంలో చంద్రబాబు  రాజ్యాంగాన్ని పక్కనబెట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు 8 మంది టీడీపీ నేతలను కమిటీలో నామినేటెడ్ మెంబర్లుగా నియమించారు. మాజీ ఎమ్మెల్యే తాట్రాజ్ ఎస్టీ కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా బాబు ఆయన్ను సలహామండలిలో చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన సలహా మండలి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. టీడీపీ నేతలను ఇష్టానుసారం నామినేటెడ్ మెంబర్లుగా చేర్చారని మండిపడ్డారు. వైయస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారనే బాబు కమిటీ ఏర్పాటులో కుట్ర పన్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాని వారిని కమిటీలో నియమించే అవకాశమే లేదని, టీడీపీ నేతల అకమ నియామకంపై న్యాయపోరాటం చేస్తామని రాజన్న దొర అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top