అవినీతి రాజ‌కీయాలను త‌రిమికొడ‌దాం

పులివెందుల‌:  రాష్ట్రంలో అవినీతి రాజ‌కీయాల‌ను త‌రిమికొడ‌దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. పులివెందుల‌లో శుక్ర‌వారం వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  కొర్పోరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థి గెలుపున‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో ఎమ్మెల్యేలు గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, కొర‌ముట్ల శ్రీ‌నివాసులు, రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, ర‌ఘురామిరెడ్డి, ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజ‌ద్‌బాషా, మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి,  మేయ‌ర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్‌రెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

Back to Top