ప్రభుత్వ పనితీరుపై ప్లీనరీలో చర్చిస్తాం

తిరువూరు :రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ మూడేళ్ళ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణకు వైయస్సార్సీపీ నిర్వహించనున్న నియోజకవర్గ ప్లీనరీ వేదికగా నిలుస్తుందని తిరువూరు ఎమ్మెల్యే కే రక్షణనిధి తెలిపారు. శనివారం తిరువూరు పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని, జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభుత్వ పాలనను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా సాగుతున్న పాలనపై గ్రామస్థాయి నుంచి ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి ఇప్పటికే గడపగడపకు వైయస్సార్‌కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో వైయస్సార్‌సీపీ చేపట్టాల్సిన ఉద్యమాలు, ప్రభుత్వంపై పోరాటాల గురించి ప్లీనరీలో విస్తృతంగా చర్చిస్తామన్నారు. తిరువూరులో జూన్‌1న ఉదయం 10.30 గంటలకు జరిగే నియోజకవర్గ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. ఈ ప్లీనరీకి నియోజకవర్గ పరిశీలకులు, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు, జిల్లా పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు పార్థసారధి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, సీనియర్‌నాయకులు వంగవీటి రాధాకృష్ణ, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌ పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, విస్సన్నపేట మండలాల పార్టీ అధ్యక్షులు శీలం నాగనర్సిరెడ్డి, చావా వెంకటేశ్వరరావు, భూక్యా గన్యా, బీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, తిరువూరు పట్టణ అధ్యక్షుడు చలమాల సత్యనారాయణ, జిల్లా కార్యవర్గసభ్యులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి, రామవరపు లక్ష్మణరావు, చెరుకు నరసారెడ్డి, ఏకొండూరు జడ్పీటీసీ సభ్యుడు పీ ఆంజనేయులు పాల్గొన్నారు.

Back to Top