మా ప్రభుత్వంలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం

–  వైయస్ జగన్ పాలనలో చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం
– సబ్సిడీతో రేషన్‌ సరఫరా, కొత్త మగ్గాలు మంజూరు

ఆదోని టౌన్‌: 2019లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, చేనేత రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్ల ఇంటి స్థలం, పక్కా ఇల్లు ,సబ్సిడీతో రేషన్, కొత్త మగ్గాలు పంపిణీతో ఆరిపోయిన చేనేత జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. ద్వారకా ఫంక్షన్‌ హాలులో ఎమ్యేల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కౌశల్య వికాస యోజన కింద శిక్షణ పొందిన 200 మంది చేనేత కార్మికులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు, కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. శిక్షణ ద్వార వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించవచ్చన్నారు. మేథా సంపత్తితో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని చెప్పారు. పింఛన్లు రాని కార్మికులు జాబితాను తనకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయిస్తానని తెలిపారు. సర్టిఫికెట్ల ప్రాధ్యాన్యతను గూర్చి వివరించారు. చేనేతలకు ఆరోగ్య పరీక్షలు నిమిత్తం వైద్య చికిత్స శిబిరం, ఐడీ కార్డులు , ఆదోనిలో క్లస్టరు ఏర్పాటు చేయిస్తాన్నారు. ఈ క్లస్టరు ద్వార చేనేతలు అభివృద్ది కేంద్రం కోటి 70 లక్షలు మంజూరు చేస్తుందన్నారు .ఆదోని ఒకటి, కోడుమూరులో 2, ఎమ్మిగనూరులో 3 క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. మగ్గాల నేసేందుకు వర్కుషెడ్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు..భూసేకరణకు కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పని సరి అన్నారు .టెక్స్‌టైల్‌ పార్కు, అప్పీరియల్‌ పార్కు ఏర్పాటుతో చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు.

పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్‌ రైలు స్టాఫింగ్‌
జిల్లాలోని ముస్లీం, మైనార్టీలు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్యేల్యేల సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం వినతి మేరకు సౌత్‌ సెంట్రల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్‌ రైలును స్టాపింగ్‌ చేయించామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ముస్లీంలు ఎంతో పవిత్రంగా పూజించే దర్గా పెనుగొండలో ఉండడంతో వేలాది మంది అక్కడకు దర్శనం చేసుకునేందుకు పోతుంటారని తెలిపారు. అయితే రైలు వసతి లేక పోవడం , కేకే ఎక్స్‌ప్రెస్‌ రైలును స్టాపింగ్‌ అయ్యేలా చూడాలని తన దృష్టికి తీసుకురావడంతో రైల్వే సీనియర్‌ మెంబర్‌ ట్రాఫిక్‌ అధికారి అహ్మద్‌తో చర్చించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. మే 27న పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆగుతుందన్నారు. రైల్వే శాఖ రైళ్ళలో మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించిందన్నారు. విభజన వల్ల చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.రైల్వే స్టేషన్‌లోను వసతులపై దృష్టి సారించడం జరిగిందన్నారు.కోడుమూరులో శాశ్వత తాగు నీటి కోసం కేంద్రం నుంచి 56 కోట్ల మంజూరుకు ప్రతి పాదనలు సిద్దం చేశామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు భర్తీ, వసతుల కల్పించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.ఆదోని రైల్వే స్టేన్‌లో తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేయిస్తున్నానని తెలిపారు.ఆదోనిలో మూత పడ్డ ఎన్‌టీసీ మిల్లు పున:ప్రారంబానికి కృషి చేస్తానన్నారు. ముస్లీంలకు ఇది శుభవార్త అని ఎమ్యేల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

Back to Top