ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

రాజకీయ లబ్ధి కోసం అధికార దుర్వినియోగం

16 లక్షల ఓట్ల తొలగింపు

నిరుద్యోగ భృతి మళ్లీ మళ్లీ మోసం చేస్తున్న
చంద్రబాబు

వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స

 విశాఖపట్టణం : వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం తెలుగుదేశం
పార్టీ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటర్ల జాబితాల్లో నుంచి పేర్లను
అక్రమంగా తొలగిస్తోందని, దీనిపై వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నామని సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్టణంలో గురువారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు
ప్రభుత్వ  తీరుపై తీవ్రస్థాయిలో
మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రికి  చిత్తశుద్ధి  లేదని ధ్వజమెత్తారు

రాజకీయ లబ్ధికోసం బాబు అధికార
దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఓట్లను గల్లంతు
చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 16లక్షల ఓట్లను తొలిగించారని అన్నారు. ఏపీలో రాజ్యాంగానికి
విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓట్ల
తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్ర  ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి  కోసం
వినియోగించాల్సిన ఆధునిక సాంకేతికతను రాజకీయాల కోసం వినియోగిస్తున్న దుస్థితి నెలకొందన్నారు.
ప్రభుత్వ సర్వే అంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనిఅడుగుతూ,
ఎవరికి ఓటేస్తారు అన్నసమాచారాన్ని అడుగుతూ, వైయస్
ఆర్ కాంగ్రెస్ కు ఓటేస్తామన్న వారి పేర్లను ఓటర్ల జాబితాల్లో నుంచి తొలగిస్తున్నారని,
రాష్ట్రంలోఇంతవరకు 16 లక్షల మంది పేర్లను తొలగించారన్నారు.
ఇలా దొంగ సర్వేలకు వస్తున్న వారి చొక్కాలు పట్టుకుని నిలదీయాలని ఆయన
పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగడం కష్టమంటూ ప్రజలు
తిరగబడితేకానీ న్యాయం జరగని పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు

కాపురి జర్వేషన్లపై యూటర్న్‌ తీసుకున్నది,
కాపు ఉద్యమకారులపై అక్రమకేసులు పెట్టింది చంద్రబాబు దాని ప్రశ్నించారు.
మంజునాథ కమీషన్‌ రిపోర్ట్‌ లేకుండా అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపేశారని అన్నారు. కాపు జర్వేషన్లపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి   వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.బీసీలకు నష్టంలే కుండా కాపు రిజర్వేషన్  ఇవ్వడానికి వైఎస్సార్‌సీపీ
ప్రయత్నిస్తోందని తెలిపారు.

 నిరుద్యోగ భృతిపై ఎన్నాళ్లు మోసం చేస్తారు

బాబు వస్తే జాబు లేకుంటే
నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు దాటినా
నిరుద్యోగ భృతిపై చర్చించడం సిగ్గు చేటన్నారు. ఇంకా ఎంతకాలం నిరుద్యోగులను మోసం
చేస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత నాలుగైదు మంత్రివర్గ
సమావేశాల్లో నిరుద్యోగ భృతిపై చర్చించారంటూ ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే,
ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు.అసలు నిరుద్యోగ భృతి ఇచ్చే ఉద్దేశం
ఉందా లేదా అని, అప్పట్లో 2 వేలు ఇస్తామని
ప్రకటించారని, ఇప్పుడు వెయ్యి రూపాయలు మాత్రమే అని అంటున్నారని,
వీటి బకాయిలను ఇస్తారా లేదా , అసలు ఎప్పటి నుంచి
అందిస్తారని ఆయన ప్రశ్నించారు. మోసం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటని
, యూటర్నులు అలవాటైన వారికి అవి రైట్ టర్నులుగానే కనిపిస్తాయని వ్యంగ్యంగా
అన్నారు. అయినా రెండు రైట్ టర్నులు తీసుకుంటే అది యూటర్న్ అవుతుందన్న
విషయం చంద్రబాబుకు తెలియదా అని బొత్స అన్నారు. నిరుద్యోగులను
మళ్లీ మోసం చేయొద్దన్నారు

 
అసత్య  ప్రచారంలో బరితెగింపు

ప్రజాధనంతో కార్యక్రమాలు
నిర్వహిస్తూ,
అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని
బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు
అనంతపురంలో మాట్లాడిన మాటలు ఆయన అసత్య ప్రచారానికి పరాకాష్టగా ఉన్నాయన్నారు.
మహానేత వైయస్ ఆర్ హయాంలోనే 80 శాతం పైగా పూర్తయిన
ప్రాజెక్టులను పూర్తి చేయలేక , ఎదురు దాడి చేయడం చంద్రబాబుకే
చెల్లిందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఎన్ టిఆర్ హయాంలోనే ప్రారంభమైందని
చెప్పుకుంటున్న చంద్రబాబు అటు తరువాత తాను ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా
ఉందన్నారు. నాడు వైయస్ ఆర్ హయాంలోని నిర్మించిన కాలువల నుంచే
నీటిని వదులుతూ,అప్పుడంతా అక్రమాలు జరిగినట్లుగా అసత్యప్రచారం
చేసుకోవడం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు
అనుమతులతో సహా పనులు వేగవంతం అయ్యింది వైయస్ ఆర్ హయాంలోనే అన్న సంగతి రాష్ట్రమంతటికీ
తెలుసుననీ, చంద్రబాబు మాత్రం పట్టిసీమ, పురుషోత్తపట్నం లలో అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రాజెక్టుల నిర్మాణంలో వైయస్ హయాంలో, చంద్రబాబు హయాంలో వెచ్చించిన నిధులు, పనులపై శ్వేతపత్రం
విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. Back to Top