బాబు భూ దోపిడీని అడ్డుకుంటాం

  • రైతుల భూములు లాక్కుంటే సహించేది లేదు
  • చంద్రబాబు భూ దాహాన్ని అడ్డుకొని తీరతాం
  • రాజన్న వారసులం..జగనన్న సైనికులం
  •  ప్రజల పక్షాన పోరాడుతాం
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే 
హైదరాబాద్ః  రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ పై న్యాయస్థానం స్టేటస్‌ కో ఇవ్వడాన్ని వైయస్సార్సీపీ స్వాగతించింది. ఇలాంటి తీర్పు కోసమే ప్రతీ పేదవాడు, రైతులు, రైతు కూలీలు ఎదురుచూస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడారు.  రైతన్న వ్యవసాయ పనులు యథాతథంగా కొనసాగించుకునేందుకు  న్యాయస్థానం స్పష్టంగా తీర్పునివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా  వ్యవహరిస్తే రాజధాని ముసుగులో అక్రమాలు చేయడానికి వీలుపడదనే బాబు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాడన్నది సుస్పష్టంగా  అందరికి అర్థమైందని ఆర్కే చెప్పారు. 

ఈనెల 11న పెనుమాక గ్రామానికి సంబంధించి 660 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో బాధిత రైతులు కోర్టుకు వెళ్లిన విషయాన్ని ఆర్కే గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయాలంటే తనకు ఇబ్బంది వస్తదని  భావించి, బాబు అధికారులను ఉపయోగించుకొని తూతూమంత్రంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ చేశాడని మండిపడ్డారు.  గ్రామాల్లో ప్రతి వ్యక్తికి చట్టం ప్రకారం అవగాహన కల్పించాకే ఇలాంటివి చేయాలని చెబుతున్నా కూడ  పట్టించుకోకుండా.....తెలుగు కూడ రాని కుర్రాడిని సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ టీం కింద పంపించి తూతూమంత్రంగా గ్రామసభలు నిర్వహించారని  దుయ్యబట్టారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ చట్టప్రకారం జరగడం లేదని, దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి గ్రామసభల్లో మినిట్స్ పుస్తకాల్లో రాయించి మరీ పంపిస్తే.... ప్రభుత్వం, సీఆర్డీఏ పరిగణలోకి తీసుకోకుండా దాన్ని తొక్కేసి రైతులను ఇబ్బంది పెట్టేవిధంగా మళ్లీ ఎక్స్ పర్ట్ కమిటీని పంపించడం దారుణమన్నారు.  బలవంతాన పోలీసుల సహకారంతో ప్రభుత్వం పేద రైతులను భయపెట్టడం వల్లే వారు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

మూడు పంటలు పండే మా భూముల జోలికి రావొద్దు, మమ్మల్ని బతకనివ్వండి అని రైతులు బతిమిలాడిన వినకుండా ...పంటలు తగలబెట్టి  హింసించి ప్రభుత్వం వేధింపులకు దిగుతోందన్నారు. ఇలాంటి విధానాలు మానుకోవాలని ఆర్కే హెచ్చరించారు. ఇప్పటికైనా న్యాయస్థానం తీర్పుకు లోబడి రైతన్న అబ్జక్షన్ ను పరిగణలోకి తీసుకొని రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాలను తుంగలో తొక్కుతూ వ్యవసాయంపై ఆధారపడి బతుకుకున్నవారి భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుతగిలితే  సహించేది లేదన్న బాబు తీరును రాబోయే రోజుల్లో అడ్డుకుంటామన్నారు. 

వేలాది ఎకరాలు రైతుల దగ్గర్నుంచి బలవంతంగా లాక్కున్నారు. అందులో ఒక్క శాతమైన రాజధాని నిర్మాణానికి వినియోగించారా..? అని ఆర్కే బాబును నిలదీశారు. పట్టుమని పది బిల్డింగ్ లు కట్టలేకపోయారు. కట్టిన ఒకటి, రెండిటికి  ఇష్టమొచ్చినట్లు వ్యయం పెంచుకొని మళ్లీ పడగొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆర్కే బాబు సర్కార్ పై ధ్వజమెత్తారు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని  హితవు పలికారు.  రాజన్న వారసులుగా,  జగనన్న సైనికులుగా....   రాష్ట్రంలో, రాజధానిలో  పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top