రూల్ 71 సస్పెన్షన్ పై కూడా కోర్టుకు వెళతాం

హైదరాబాద్ః  రోజా సాధించిన విజయం ప్రజల విజయమని, రాష్ట్ర మ‌హిళలోకం సాధించిన విజ‌య‌మ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అమ్జద్‌బాషా అన్నారు. స్పీక‌ర్ రూల్స్‌కు విరుద్ధంగా ఏడాదిపాటు ఒక శాస‌న‌స‌భ్యురాల‌ని స‌స్పెండ్ చేయ‌డం అన్యాయ‌మ‌న్నారు. అలా చేయడం తప్పని కోర్టులో నిరూపితమైందన్నారు. న్యాయస్థానంలో న్యాయం జ‌రిగింద‌న్నారు. 

అసెంబ్లీని టీడీపీ కార్యాల‌యంలా వాడుకుంటున్నార‌ని అమ్జద్ బాషా ప్రభుత్వంపై మండిపడ్డారు.  స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కూడా ... మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణడుు రూల్ 71ను స‌స్పెండ్ చేశారన్నారు. ఈ విష‌యంపై కూడా కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top