వైయస్‌ జగనన్నకు మద్దతుగా నిలుద్దాం

ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మద్దతుగా నిలుద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు జ‌క్కంపూడి రాజా యువ‌త‌కు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కేంద్రంలోని బీజేపీతో క‌లిసి పోటీ చేసే సమయంలో హోదా 15 ఏళ్లు కావాలని చెప్పి అధికారంలోకి వ‌చ్చాక హోదాను మ‌రిచిపోయార‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్కు అని, హోదా కోసం పోరాడుతున్న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ అని పేర్కొన్నారు. అందుకే వైయ‌స్ జ‌గ‌న్ చేప‌డుతున్న యువ‌భేరి కార్య‌క్ర‌మాల‌కు యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌న్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమలు లేవని, ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఈ ప్రాంతంలో భారీగా ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.  నిరుద్యోగ స‌మ‌స్య కూడా తీరుతుంద‌న్నారు. కాబ‌ట్టి జ‌గ‌న‌న్న ప్ర‌త్యేక హోదా కోరుతూ చేసే పోరాటానికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.
Back to Top