ఐక‌మ‌త్యంతో ముందడుగు వేద్దాం

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చేసేందుకు అంద‌రం ఐక‌మ‌త్యంగా ముంద‌డ‌గు వేద్దామ‌ని వైయ‌స్ఆర్ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త  వైయ‌స్ వివేకానంద‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణంలోని వసుంధర కల్యాణమండపంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్యర్యంలో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వ‌హించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి, వైయ‌స్ వివేకానంద‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ప్లీనరి పరిశీలకులు ఇరగంరెడ్డి తిరుపాలురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తాను అవినీతికి పాల్పడటమే కాక పార్టీలోని మంత్రులు, నాయకులకు నేర్పిస్తూ ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, నీరు–చెట్టు పనులు ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో సరుకులు కొనుగోలు చేసినట్లు కొనడం చంద్రబాబుకే  సరన్నారు. పార్టీ మారిన నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, రాబోయే ఎన్నికల్లో వీరు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగితే  నిలదీయడం ఖాయన్నారు.

Back to Top