జ‌గ‌న‌న్న రావాలి..జ‌గ‌న‌న్న కావాలి


 -అంద‌రి నోట ఇదే మాట‌
- బాబుకు ఓట్లు మోస‌పోయామంటున్న జ‌నం
- రాజ‌న్న రాజ్యం వ‌స్తేనే పేద‌ల‌కు మేలు
- పాద‌యాత్ర‌లో స‌మ‌స్య‌ల వెల్లువ‌

వైయ‌స్ఆర్ జిల్లా: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. జ‌న‌నేత ఏ ఊరికి వెళ్లిన ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తుకు చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో మోస‌పోయిన ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని నిన‌దిస్తున్నారు. జ‌గ‌న‌న్న రావాలి..జ‌గ‌న‌న్న కావాల‌ని చిన్న‌, పెద్ద తేడా లేకుండా ఇదే మాట ప‌లుకుతున్నారు. ఈ నెల 6వ తేదిన ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వైయ‌స్ఆర్ జిల్లాలోని పులివెందుల‌, క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి చేసుకొని ఇవాళ జ‌మ్ముల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. ఇప్పటివరకు మూడురోజులు పాదయాత్ర పూర్తి చేసిన ఆయన 39 కిలోమీటర్లు నడిచారు. 

ఊరూవాడా క‌దిలివ‌చ్చి..
వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డిని మనసారా దీవించేందుకు ఊరూవాడా కదిలివస్తోంది. ఊరికి అన్న వస్తున్నాడని.. హృదయపూర్వక స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకుని గంటలపాటు నిరీక్షిస్తున్నారు. అభిమాన నేత తమ దరి చేరిన ఆనందంలో హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. ఓ వైపు బాణాసంచా పేలుళ్లు.. మరో వైపు డప్పుల మోతలు.. వీటికి తోడు నినాదాలు..పల్లెలు హోరెత్తుతున్నాయి.
ప్ర‌జా సంకల్ప పాదయాత్ర షెడ్యూల్‌ ప్రకారం ఆలస్యంగా సాగుతున్నా జననేతను చూసేందుకు ప్రజలు రోడ్లపైనే ఎండలో నిరీక్షిస్తున్నారు.  జగన్‌కు వారి సమస్యలను చెప్పుకున్నారు. బాణాసంచా పేలుస్తూ స్వాగతం పలికారు. ప్రజలు భారీగా తరలివచ్చి మేమంతా మీ వెంట అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. జనాలు, మహిళలు వైయ‌స్ జగన్‌ కోసం వేచి ఉండి, ఆయన చూసి సంబరపడిపోయారు. వైయ‌స్ జగనన్న సీఎం కావాలని, ఆయన అధికారంలోకి వస్తేనే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజలు చెప్పుకున్నారు.
Back to Top