మేం ప్రజాబలాన్నే నమ్ముకున్నాం

  • చంద్రబాబు అవినీతి సొమ్మును నమ్ముకున్నాడు
  • వేలకోట్లు కుమ్మరించి ఎన్నికలు గెలవాలని చూస్తున్నాడు
  • అవినీతి సొమ్మును వెదజల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు
  • వైయస్సార్సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలుః చంద్రబాబు, మంత్రులు నంద్యాలలో తిష్టవేసి అవినీతి సొమ్మును వెదజల్లి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. భూమా నాగిరెడ్డికి వైయస్సార్సీపీ పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిందని..అయినా కూడ మోసం చేసి వెళ్లారని అన్నారు. భూమా నాగిరెడ్డి పిల్లలకు తండ్రిలేని వారిని చేసిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు. భూమా నాగిరెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీకి రాజీనామా చేసుంటే పోటీ పెట్టేవాళ్లం కాదన్నారు. అలా చేయనందునే నంద్యాలలో పోటీ అనివార్యమైందన్నారు. చంద్రబాబు నంద్యాల ఎన్నికల్లో రూ.200 కోట్లు ఖర్చుచేశారని ధ్వజమెత్తారు.  ఎలాంటి సంప్రదింపులు జరపకుండా  రోడ్ల వెడల్పు కోసం టౌన్ లో 2,3 కి.మీ. దూరంలో కట్టిన బిల్డింగ్ లు పడగొట్టారన్నారు. కనీస పరిహారం కూడ ఇవ్వలేదన్నారు.  లక్షా 10వేలు విలువ చేసే చోట రూ.18వేలు ఇవ్వడం దారుణమన్నారు. బాబు, మంత్రులు నెలరోజుల పాటు తిష్టవేసి అందరినీ భయపెట్టి ఓట్లు వేయించుకున్నారన్నారు. ఎలక్షన్ కోడ్ లో కూడ తమకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు ఓటుకు రూ.5వేలు ఖర్చు చేస్తానని చెప్పినా కూడ ఎలక్షన్ అధికారులు ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. రాజ్యాంగరీత్యా అది తప్పు అని స్పష్టం చేశారు. ఆయన సీఎం కాబట్టే కేసులు పెట్టలేదని అన్నారు. టీడీపీ నేతలంతా ఇంటింటికీ ప్రచారం చేస్తూ మీరు ఓటేయకపోతే పెన్షన్ ఆగిపోతుందని ఓటర్లను భయపెట్టారని ఐజయ్య మండిపడ్డారు.  నంద్యాలలో బాబు ఓటుకు రూ.5వేలపైన అవినీతి సొమ్మును వెదజల్లాడని, చీరలు, ముక్కుపుడకలు కుమ్మరించారని ఐజయ్య ధ్వజమెత్తారు. 

 ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్లు మురిగిపోయాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు.  వాళ్లు కూడ ప్రభుత్వానికి భయపడ్డారని,  అందుకే ఓటేయలేదమోనని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 200కోట్లు ఖర్చు చేసి బాబు ప్రజలను మభ్యపెట్టారన్నారు. వైయస్ జగన్ సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారని,  బాబు మోసాల వల్లే చివరలో ఓటు వేయలేకపోయారని తెలుస్తోందన్నారు. బడ్జెట్ లక్ష కోట్లు దాటనప్పుడు చంద్రబాబు మూడులక్షల కోట్లు ఎలా సంపాదిస్తాడంటూ సబ్బం హరి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పేదల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను బాబు తన సొంత వ్యాపారాలకు మళ్లిస్తుంటే....  రాజధానిలో 32వేల ఎకరాలను తీసుకొని రియల్ ఎస్టేట్ కు అమ్మితే దాన్ని అవినీతి అనరా..? 2007లో వైయస్ఆర్ పోలవరం ప్రారంభించినప్పుడు పదివేల కోట్లు ప్రాజెక్ట్ వ్యయంగా నిర్ణయించారని, కానీ  బాబు దాన్ని 60వేల కోట్లకు తీసుకెళ్లాడన్నారు.  పట్టిసీమ రూ.300కోట్లయితే రూ.1600కోట్లు తీసుకుపోయినాడని, రేపు పురుషోత్తపట్నం కూడ రూ. 2వేల కోట్లకు చేస్తాడని అన్నారు. తన మనుషులకు టెండర్లు కట్టబెడుతున్నాడని దుయ్యబట్టారు. నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచ గ్రామంలో వేయి ఎకరాలు అప్పనంగా బాబు తన వాళ్లకు దోచిపెడుతున్నారని ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా చంద్రబాబు మూడులక్షల కోట్లకుపైగా దోచుకుంటుంటే ఎలా దోచుకుంటారని సబ్బంహరి మాట్లాడడం విడ్డూరమన్నారు. చంద్రబాబు తన వాళ్లకు బ్లాక్ మనీని డెవలప్ చేస్తున్నారని విమర్శించారు.   రూ. 2లక్షల కోట్లు ఇచ్చాం,  ఏం చేశారో చెప్పాలని కేంద్రం అడుగుతుంటే బాబు పలకడం లేదని ఎద్దేవా చేశారు.  ఎక్కడా పారదర్శకత లేదన్నారు. మోసపూరిత ఎలక్షన్లను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నంద్యాల ఎన్నికను నమూనాగా తీసుకొని ఈవిధంగనే పోతే పులివెందులలో కూడ గెలుస్తామని బాబు మాట్లాడుతున్నారని...చంద్రబాబు అవినీతి సొమ్మును నమ్ముకున్నారని, కానీ తాము మాత్రం ప్రజాబలాన్నే నమ్ముకున్నామన్నారు. 
Back to Top