జ‌గ‌న‌న్న‌కు తోడుగా నిలుద్దాం

నెల్లూరు(సెంట్రల్‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌నమంతా అండ‌గా నిలిచి ముఖ్య‌మంత్రిని చేయాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. ``వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే  స్థానిక 6వ డివిజన్‌లోని పలు ప్రాంతాలలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి,  ఇళ్ల స్థ‌లాలు వంటి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలుచేయలేదన్నారు. ఈ విషయాలనే ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు మోసాలను చెప్పడంతో పాటు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలు ప్రవేశపెడుతుందో తెలియచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలలో విశేష స్పందన వస్తుందన్నారు. వీటితో పాటు వైయ‌స్ఆర్ కుటుంబంలో  ప్రతి ఒక్కరు స్వచ్చందంగా చేరుతున్నార‌న్నారు.

Back to Top