హోదా ఉద్యమానికి మద్దతు

  • ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
  • వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి తమ ఆకాంక్షను చాటి చెప్పారు. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని ఎన్ని కుట్రలు చేసినా...రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతి, కూతుళ్లు, తదితరులు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో క్యాండిల్‌ వెలిగించి హోదా ఉద్యమానికి మద్దతు తెలిపారు. 
Back to Top