జల దోపిడీని అడ్డుకుంటాం

అక్రమ ప్రాజెక్ట్ లపై నోరుమెదపని అవినీతి బాబు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతాం
వైయస్ జగన్ నాయకత్వంలో ఉద్యమిస్తాం
రాష్ట్ర హక్కులను కాపాడుకుంటాంః పార్టీ నేతలు

కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరుమెదపకపోవడం దారుణమని వైయస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. చంద్రబాబు చేయాల్సిన పనిని వైయస్ జగన్ చేస్తున్నారని చెప్పారు.  బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏపీ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని బాబును నిలదీశారు.  కర్నూలులో వైయస్ జగన్ జలదీక్ష సందర్భంగా ఆమె మాట్లాడారు.  రాయలకాలంలో రత్నాలసీమగా పేరుగాంచిన రాయలసీమ నేడు వెనుకబడిపోవడానికి నీళ్లు లేకపోవడమే కారణమని బుట్టా రేణుక అన్నారు. నీళ్లులేకపోతే ఎలా అభివృద్ధి చెందుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కలసివుంటే ఇలాంటి సమస్యలు రావనే ముందుచూపుతో సమైక్యఉద్యమం చేశామని చెప్పారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఏవిధంగా న్యాయం చేస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ ల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.  ఇప్పటికే కరవు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమకు సాగు నీరు దేవుడెరుగు తాగడానికి  కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంటుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తు పెంపు పేరుతో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 160 టీఎంసీలు కొల్లగొట్టాలని చూస్తోందన్నారు. అదే జరిగితే  రాయలసీమలో లక్షలాది ఎకరాలు ఎడారిగా మారుతాయన్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఎంతసేపు బాబుకు అవినీతి దందాలు తప్ప ప్రజల ప్రయోజనాలే పట్టడం లేదని మండిపడ్డారు.  తక్షణమే ఆప్రాజెక్ట్ లను నిలిపేయాలన్నారు. కృష్ణా, గోదావరి నదులపై జరుగుతున్న జలదోపిడీని  అడ్డుకుంటామన్నారు.  అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. వారు దిగివచ్చే వరకు వైయస్ జగన్ నాయకత్వంలో పోరాడుతామని స్పష్టం చేశారు. 

ప్ర‌జ‌లు నాయ‌కుల‌ను త‌యారు చేస్తారుగానీ.. నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను త‌యారు చేయ‌లేర‌ని, చంద్ర‌బాబు ప్ర‌లోభాల‌కు లొంగి వెళ్లిపోయిన వారంతా ఉత్త‌పొట్టేన‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. ఐజ‌య్య విమ‌ర్శించారు. క‌ర్నూలు జ‌ల‌దీక్ష ప్రాంగ‌ణం వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసి చంద్రబాబు రాష్ట్రంలో నీచ‌రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల‌ను క‌ట్టి రాష్ట్రానికి ద‌క్కాల్సిన నీటిని అక్ర‌మంగా తోడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే చంద్ర‌బాబు మాత్రం చోద్యం చూస్తున్నార‌ని మండిపడ్డారు. ప‌ట్టిసీమ పేరుతో వంద‌ల కోట్లు దోపిడీ చేసి అవినీతి సొమ్ముతో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు ప్ర‌లోభాల‌కు లొంగి ఎమ్మెల్యేలంతా ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నా ప్ర‌జా సంక్షేమం కోసం బాధ్య‌త‌గా మొక్క‌వోని ధైర్యంతో వైయ‌స్ఆర్ సీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్  జ‌గ‌న్ ముందుకు సాగుతున్నార‌ని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా ప్ర‌జ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మొహం చాటేసుకొని తిరుగుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స్పందించ‌క‌పోయినా.. రైతులు, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంలో పోరాటాలు చేసి ఏపీ హ‌క్కుల‌ను కాపాడుకుంటామ‌ని చెప్పారు.
Back to Top