వ్యవస్థలంటే గౌరవం - ఎమ్మెల్యే రోజా

న్యూఢిల్లీ) శాసనసభ ను, ముఖ్యమంత్రిని అగౌరవ పరిచే ఉద్దేశ్యం తనకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. అసెంబ్లీ లో ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె చెప్పారు. శాసనసభ నుంచి ఏడాదిపాటు అక్రమంగా సస్పెండ్ చేసిన ఘటనకు సంబంధించి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో నేడు విచారణకు వచ్చింది. దీని మీద వాదనలు వినిపించిన రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాల్ని వివరించారు. దీనిమీద ప్రభుత్వం తరపు న్యాయవాది వివి రావు వాదిస్తూ.. రోజా క్షమాపణ చెప్పాలని పట్టు పట్టారు. 
దీని మీద సుప్రీంకోర్టు స్పందించింది. రెండు పక్షాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. క్షమాపణలు అవసరం లేదని, వివరణ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. దీన్ని శాసనసభ స్పీకర్ కు పంపించాలని న్యాయస్థానం పేర్కొంది.
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలని రోజా అభిప్రాయ పడ్డారు. అధికార పార్టీ శాసనసభలో విపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టే తరహాలో వ్యవహరించటం సరికాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని రోజా అన్నారు. ఈ మేరకు ఆమె తన వైఖరిని వినిపించారు. 
Back to Top