ప్ర‌జాతీర్పును గౌర‌విస్తున్నాం

నంద్యాలః ప్ర‌జా తీర్పును గౌర‌విస్తున్నాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక‌ల అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ భారీగా డ‌బ్బులు పంచ‌డం, సానుభూతితో వ‌చ్చిన ఓట్ల‌తోనే ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. టీడీపీ చేప‌ట్టిన అభివృద్ధి వ‌ల్లే ఓట్లు ప‌డ్డాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు అన‌డాన్ని విశ్వ‌సిండ‌డం లేద‌ని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేశారని, ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించకుంటామని ఆయన చెప్పారు.

Back to Top