ఎన్నికుట్రలు చేసినా ఆ సీటు మాదే

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైయస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పోటీలో నిలిపినట్టు ఆయన వెల్లడించారు.  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి హైదరాబాద్లో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ను కలిశారు. ఫామ్ ఏఏ, ఫామ్ బీబీ పత్రాలను ఫుల్ ఫిల్ చేసి ఎన్నికల కమిషనర్ కు ఇచ్చి వెళ్లేందుకు వచ్చినట్లు చెప్పారు.  

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. సరిపోయేంత బలం ఉండబట్టే తాము రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఉమ్మారెడ్డి తెలిపారు. బలం లేకుండా పోటీ చేస్తే తెలంగాణలో ఏంజరిగిందో అందరికీ తెలుసనని ఆయన అన్నారు. నాలుగో అభ్యర్థికి సరిపోయేంత బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయడం అనైతికమన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా తాము రాజ్యసభ స్థానం గెలుచుకొని తీరుతామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. 

Back to Top