జగన్ ఆరోగ్యం గురించి భయపడ్డాం

హైదరాబాద్, 31 ఆగస్టు 2013:

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం విషయంలో నిన్న, ఈ రోజు మధ్యాహ్నం వరకూ తాము భయపడ్డామని ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి చెప్పారు. ని‌మ్సు ఆస్పత్రి వద్ద ఆమె శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్‌ శరీరంలో సుగర్, బి.పి., పల్సు రేటు ఇలా అన్ని స్థాయిలూ తగ్గిపోయాయని ఆమె చెప్పారు. మెటబాలిజం తగ్గడంతో ఆయన శరీరం కూడా చల్లబడుతోందని వైద్యులు చెప్పారన్నారు.

ఆరోగ్యం క్షీణించిన దృష్ట్యా దీక్ష విరమించుకోవాలని మేం ఎవరం చెప్పినా‌ శ్రీ జగన్ వినలేదని శ్రీమతి భారతి చెప్పారు. తన తండ్రి కూడా డాక్టరేనని, లెవెల్సు పడిపోయే కొద్దీ మంచిది కాదని ఆయన కూడా దీక్ష విరమించమని ఎంత చెప్పినా విరమించలేదన్నారు. ఆ  తరువాత శ్రీ జగన్ ఆరోగ్యం విషయంలో తాము చాలా ఆందోళన చెందినట్లు తెలిపారు. కోర్టు ఆర్డ‌ర్ తీసుకువచ్చి చూపించి 8 నుంచి పది మంది వైద్యులు బలవంతంగా ‌ఆయన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసి, ఐవి ఫ్లూయిడ్సు ఎక్కించినట్లు తెలిపారు. తాను బయటికి వచ్చే ముందు రక్త పరీక్షలకు శ్రీ జగన్‌ నుంచి వైద్యులు బ్లడ్‌ తీసుకున్నారని, పరీక్షల తరువాత ఆయన ఆరోగ్య విషయాలు తెలుస్తాయనుకుంటా అన్నారు. బహుశా రెండు మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే శ్రీ జగన్‌ను ఉంచుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితులు, దీక్ష గురించి శ్రీ జగన్‌తో తానేమీ మాట్లాడలేదని శ్రీమతి భారతి స్పష్టంచేశారు.

పల్సు రేటు పడిపోయినా, కీటోన్సు పెరిగితే కిడ్నీలు దెబ్బతింటాయని, సుగర్‌ లెవెల్సు తగ్గితే కోమాలోకి పోతావన్నారు చెప్పినా భయం లేదా అని తాను శ్రీ జగన్ను అడిగినట్లు చెప్పారు. దానికి ఆయన ‌'స్పందించ వలసినప్పుడు మనం స్పందిచాలి' అని అన్నట్లు ఆమె తెలిపారు. తన ముందు శ్రీ జగన్కు మూడు సెలై‌న్లు ఎక్కించినట్లు తెలిపారు. ఏడు రోజుల నుంచి ఆహారం తీసుకోనందున వెంటనే ఆహారం పెట్టరని చెప్పారు. డాక్టర్లు అందరూ మంచివారేనని చెప్పారు. ఎక్కడైనా డాక్టర్లు పేషెంట్లను బాగానే చూస్తారన్నారు.

తన వద్ద శ్రీ జగన్ ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదని శ్రీమతి భారతి చెప్పారు. ఎల్లుండి శ్రీమతి షర్మిలమ్మ బస్సు యాత్ర మొదలుపెడతారన్నారు.

Back to Top