బాబు పాలన మాకొద్దు

బందర్ పోర్టు బాధితులకు జననేత బాసట
టీడీపీ సర్కార్ బలవంతపు భూసేకరణపై ఆగ్రహం

కృష్ణాః టీడీపీ సర్కార్ నిరంకుశత్వ పాలనపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. బందర్ పోర్టు పేరుతో బలవంతంగా రైతుల భూములను లాక్కోవడం, వారిపై బెదిరింపులకు దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్దాలపాలెంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా బాధిత రైతుల కష్టాలను  వైయస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  రైతులు, మహిళలు  తమ గోడును జననేతకు చెప్పుకున్నారు. భూములు ఇచ్చేందుకు తమకు ఇష్టం లేకున్నా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, తమకు అండగా నిలవాలని కోరారు.  మాకొద్దు బాబు పాలన అని ముక్తకంఠంతో నినదించారు. 

బాధిత రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి

గాయత్రి, బుద్దాలపాలెం 
మా ఊరిలో 700 ఎకరాలు లాక్కుంటున్నారు. అందులోనే  అంగన్‌వాడీ కేంద్ర భవనం, పంటపొలాలున్నాయి. మేము సెంట్‌ భూమి కూడా ఇచ్చేది లేదు. ఏ ఒక్క రైతూ భూములు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా చంద్రబాబు మాత్రం టీవీల్లో రైతులు సంతోషంగా భూములు ఇస్తున్నారని అబద్ధాలు చెబుతున్నాడు..

కల్యాణి, సర్పంచ్, చంద్రహారం
మా అత్తగారింటి దగ్గర మొదలెట్టి పుట్టింటి దాకా 12 కిలోమీటర్ల వరకు మూడు వేల ఎకరాలు భూములు లాక్కుంటున్నారు. మా నాన్న పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమి కూడా ల్యాండ్‌ పూలింగ్‌లోనే ఉంది. రెండు పంటలు పండే భూమి మాది. నా కొడుకు కాలేజీ ఫీజులకు బ్యాంకులకు లోన్‌ కోసం వెళితే ఇవ్వడం లేదు. పొలాలకు నీళ్లు ఆపేశారు. మాకు అండగా నిలబడిన వైయస్ఆర్‌ సీపీ నాయకుడు పేర్ని నానికి గాజులు వేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు మహిళలంటే అంత చులకనా?

నాగేశ్వరావు, హుస్సేన్‌పాలెం...
నాది పదెకరాల పొలం ఉంది. ముగ్గురు కూతుళ్లున్నారు. లోన్లు రాలేదు.. నీళ్లు రాలేదు. మూడు పంటలు పండే పొలాలు. బాబు దొంగతనంగా మా పొలాలు లాగేసుకునే కుట్ర చేస్తున్నారు. మా పిల్లలకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. దానికి పొలాలు అమ్ముకోవాలి. కానీ రిజిరేష్ట్రన్లు ఆపేశారు. ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా ఉంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top