స‌భ‌ను ఇష్టారాజ్యంగా న‌డిపితే ఒప్పుకోం

ఏపీ అసెంబ్లీ:  శాస‌న స‌భ‌ను అధికార పార్టీ ఇష్టారాజ్యంగా న‌డిపితే ఒప్పుకోమ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజ‌య్య హెచ్చ‌రించారు. శుక్ర‌వారం స‌భ ప్రారంభానికి ముందు ఆయ‌న మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ అసెంబ్లీలో అధికార పార్టీ అనుస‌రిస్తున్న తీరును ఖండించారు.స‌భ‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓటుకు కోట్లు కేసు అబ‌ద్ధ‌మా?  సుప్రీంకోర్టు చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చింది కూడా అబ‌ద్ధ‌మా?  అని ప్ర‌శ్నించారు. బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి ఇలా చేయ‌డం ప‌ద్ధ‌తి కాదు అన్నారు. ప్ర‌భుత్వానికి ద‌మ్మూ, ధైర్యం ఉంటే వాదోప‌వాదాల‌కు సిద్ధం కవాల‌ని స‌వాల్ విసిరారు.. న్యాయంగా స‌భ జ‌ర‌పండి. మాకు కూడా స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం ఇవ్వండి, స‌క్ర‌మ మార్గంలో స‌మావేశాలు న‌డ‌పాలని ఐజ‌య్య కోరారు.

Back to Top