మహానేత నిన్ను మరువలేము

()తెలుగునాట వైయస్ఆర్ మధుర స్మృతులు
()7వ వర్థంతి సందర్భంగా ప్రియతమ నేతకు నివాళులు
()దుస్తులు, పండ్ల పంపిణీ..అన్నదాన,రక్తదాన కార్యక్రమాలు
()మా హృదయాల్లో చెరగని చిరునవ్వు నీవు రాజన్నా
()మీ రుణం తీరనిది..మీ మేలు మరువనిది
()వైయస్ఆర్ మధుర జ్ఞాపకాల్లో ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు

తెలుగు నాట ప్రతీ గుండె మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకుంటోంది. మహానేత నిన్ను మరువలేము. నీవు అందించిన సంక్షేమ పథకాలు మాకు ఊపిరిపోశాయి. భౌతికంగా నీవు మానుండి దూరమై 7 వసంతాలు అయినా మా హృదయాల్లో ఎప్పటికీ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటావు రాజన్న అంటూ తమ ఆరాధ్యదైవంనకు నివాళులర్పిస్తున్నారు. వాడవాడలా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 7వ వర్థంతి కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మహానేత, ఆయన అందించిన అద్భుతమైన పాలన మధుర జ్ఞాపకాలను తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 

చిత్తూరు జిల్లా
తిరుప‌తిలోని వైయ‌స్సార్‌సీపీ కార్యాల‌యంలో ఎంపీ వరప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు
వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళ్లుల‌ర్పించారు. అనంత‌రం వైయ‌స్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి  7వ వర్థంతి కార్య‌క్ర‌మాలు పలమనేరు పట్టణ కన్వీనర్ మండీ సుధాకర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణ మార్కెట్ యార్డు స‌మీపంలో ఉన్న‌ వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించి, ప్ర‌జ‌ల‌కు అన్నదానం చేప‌ట్టారు. చిత్తూరు ప‌ట్ట‌ణంలో జిల్లా క‌న్వీన‌ర్ జంగాల‌ప‌ల్లె శ్రీనివాసులుఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ కార్య‌ల‌యం వ‌ద్ద వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్ళు అర్పించారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌మౌళి ఆధ్వ‌ర్య‌లంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మ‌ద‌నప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ప్ర‌కాశం జిల్లా
గిద్దూలురు స‌హా ప‌లు గ్రామాల్లో వైయ‌స్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో సేవ కార్య‌క్ర‌మాల ఏర్పాటు చేశారు. వైయ‌స్ఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా చీరాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పండ్లు, దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేసిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. ఒంగోలులో శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు.  మార్టూరులో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లు అర్పించిన వైయ‌స్సార్సీపీ నేత గొట్టిపాటి భ‌రత్‌కుమార్‌. ఇంకొల్లులో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన  వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి, అన్న‌దాన కార్య‌క్ర‌మం ఏర్పాటు. వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట్ స‌భ్యులు వై.వి.సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో గిద్ద‌లూరు, కంభం ప‌లు ప్రాంతాల్లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు. ఒంగోలు పార్టీ కార్యాల‌యంలో బాలినేని ఆధ్వ‌ర్యంలో నివాళి కార్య‌క్ర‌మాలు. 

గుంటూరు జిల్లా
వైయ‌స్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా పెద్ద‌కూరపాడులో ముస్లిం యూత్ ఆధ్వ‌ర్యంలో అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వహించారు. రేప‌ల్లెలోని వైయ‌స్సార్‌సీపీ పార్టీ కార్యాల‌యంలో వైయ‌స్పార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌. అనంత‌రం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కు పండ్ల పంపిణీ. వేమూరు నియోజ‌క‌వ‌ర్గంలో మెరుగ నాగార్జున ఆధ్వ‌ర్యంలో కొన‌సాగిన వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు. పొన్నూరులో వెంక‌ట‌ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం.  వైయ‌స్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా తంగ‌డికుంట‌లో ఎమ్మెల్యే ముస్తాఫా ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం. బాప‌ట్ల మున్సిపాల్ కార్యాయ‌లంలో ఎమ్మెల్యే కొన‌స ర‌ఘుప‌తి ఆధ్వ‌ర్యంలో వైయస్ఆర్ కు నివాళి. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. స‌త్తెన‌ప‌ల్లిలో రోగుల‌కు పండ్లను పంపిణీ చేసిన వైయ‌స్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు. తెనాలిలో నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బ‌త్తుల శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో వృద్ధుల‌కు వ‌స్త్రాల పంపిణీ, అన్న‌దాన కార్య‌క్ర‌మం 

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా
ఏలూరులోని ఫైర్ స్టేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద వైయ‌స్సార్ విగ్ర‌హానికి నివాళ్లుల‌ర్పించిన జిల్లా క‌న్వీన‌ర్‌. వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఆళ్ల‌నాని. భీమ‌వ‌రంలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ‌నివాస్‌. పాల‌కొల్లులో వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేక శేషుబాబు, పేద‌ల‌కు పండ్ల పంపిణీ.

కృష్ణా జిల్లా
విజ‌య‌వాడలోని వైయ‌స్సార్‌సీపీ కార్యాల‌యంలో వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులర్పించిన  జిల్లా అధ్య‌క్షుడు పార్థ‌సార‌ధి, వంగ‌వీటి రాధా. భ‌వానీపురంలోని అనాధ ఆశ్ర‌మంలో అన్న‌దానం . పండ్లు రొట్టెలు పంపిణీ చేసిన తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ భ‌వ‌కుమార్ .తిరువూరులో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసిన ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి. మైల‌వ‌రం నియోజ‌వ‌క‌ర్గ ఇంచార్జీ జోగి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు. గ‌న్న‌వ‌రంలోని హ‌నుమాన్ జంక్ష‌న్‌లో నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త రామ‌చంద్ర‌రావు వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు

నెల్లూరు జిల్లా
గాంధీబొమ్మ సెంట‌ర్‌లోని వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లు ఆర్పించిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌. సూళ్లురుపేట‌లో వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళ్లు ఆర్పించిన ఎమ్మెల్యే సంజీవ‌య్య . నాయుడుపేట‌లో వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్న‌దానం.ఉద‌య‌గిరి ప‌ట్ట‌నంలో మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు

అనంత‌పురం జిల్లా
పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కు పండ్లు, దుప్ప‌ట్లు పంపిణీ చేసిన వైయ‌స్సార్ సీపీ నేత‌లు. ఉర‌వ‌కొండ‌లో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు. గుంత‌క‌ల్లులోని వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసిన వైయ‌స్సార్‌సీపీ నేత వెంక‌ట్రామిరెడ్డి, రక్త‌దాన శిబిరం ఏర్పాటు. రాయ‌దుర్గం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కు పండ్ల‌ను పంపిణీ చేసిన వైయ‌స్సార్‌సీపీ నేత రామ‌చంద్రారెడ్డి.క‌ళ్యాణ‌దుర్గం లో రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎల్లం ఆధ్వ‌ర్యంలో నివాళి 

వైయ‌స్సార్‌ జిల్లా
క‌మ‌లాపురం అనాధ ఆశ్ర‌మంలో పండ్లు, వ‌స్త్రాల‌ను పంపిణీ చేసిన వైయ‌స్సార్‌సీపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు పుల్లారెడ్డి. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీ‌నివాసులు పార్టీ కార్యాల‌యంలో వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల, నివాళులర్పించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాలాభిషేకం, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పండ్ల పంపిణీ. పోరుమామిళ్ల మండ‌ల అధ్య‌క్షుడు విజ‌య‌ప్ర‌తాప్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో పండ్ల పంపిణీ. బ‌ద్వేల్ లో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసిన వైయ‌స్సార్‌సీపీ నేత గురుమోహ‌న్‌ జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ సుధీర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాలాభిషేకం.

క‌ర్నూలు జిల్లా
తుగ్గ‌లిలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించిన ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ చెరుకుపాడు నారాయ‌ణ‌రెడ్డి, కార్య‌క‌ర్త‌లు
బ‌న‌గాన‌ప‌ల్లె ఆస్ప‌త్రిలో రోగుల‌కు పండ్లు దుప్ప‌లు కాట‌సాని రామిరెడ్డి. శ్రీ‌శైలం మ‌న్నిసెంట‌ర్‌లో పాలాభిషేకం చేసిన చ‌లమారెడ్డి. కార్యాల‌యంలో జిల్లా అధ్య‌క్షుడు గైరు వెంక‌ట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్త‌కోట ప్ర‌కాష్ రెడ్డి,నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య‌ ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమం మహానేతకు నివాళులు

శ్రీ‌కాకుళం జిల్లా
ఆముదాల‌వ‌ల‌స‌లో త‌మ్మినేని సీతారం విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లుల‌ర్పించిన ఎమ్మెల్యే క‌ళావ‌తి . శ్రీకాకుళంలో రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

విజయనగరం జిల్లా
ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో సాలూరులో వైయస్ఆర్ వర్థంతి కార్యక్రమం జరిగింది. మహానేత విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన రాజన్నదొర. అనంతరం రోగులకు పండ్ల పంపిణీ. కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వైయస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు

విశాఖ‌ప‌ట్నం జిల్లా
గొలుగొండ మండ‌లం జోగుంపేటలో వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసిన వైయ‌స్సార్‌సీపీ నేత గ‌ణేష్. బీచ్‌రోడ్డులోని వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసిన జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్నాథ్, స‌మ‌న్వ‌య క‌ర్తలు వంశీకృష్ణ‌, విజ‌య్‌ప్ర‌సాద్ త‌దిత‌రులు.యల‌మంచిలిలో వైయ‌స్సార్ సీపీ నేత ప్ర‌గ‌డ నాగేశ్వ‌ర్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు.

తూర్పుగోదావ‌రి జిల్లా
ప్ర‌త్తిపాడులో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసిన నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ పూర్ణ‌చంద్ర‌ప్ర‌సాద్, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని రోగుల‌కు పండ్ల పంపిణీ. రాజ‌మండ్రి గ‌న్న‌వ‌రంలో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే బుగ్గిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు. అమ‌లాపురంలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసిన కోఆర్డినేట‌ర్ విశ్వ‌రూప్, పేద‌ల‌కు పండ్లు, దుప్ప‌ట్లు పంపిణీ. మండ‌పేట‌లో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుడు ప‌ట్టాబిరామ‌య్య ఆధ్వర్యంలో వైయ‌స్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు, దుప్ప‌ట్ల పంపిణీ. రామ‌చంద్ర‌పురం పిన్నెళ్లి సుభాష్‌చంద్ర‌బోస్ ఆధ్వ‌ర్యంలో పండ్ల పంపిణీ

కరీంనగర్ జిల్లా
జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ వైయస్ఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

మహబూబ్ నగర్ జిల్లా
నాగర్ కర్నూలులో రైతు విభాగం అధ్యక్షులు నిరంజన్ రెడ్డి వైయస్ఆర్ కు నివాళులర్పించారు. షాద్ నగర్ లో మహానేతకు అంజలి ఘటించిన బొబ్బిలి సుధాకర్ రెడ్డి, శేఖరరెడ్డి, పలువురు నేతలు
Back to Top