అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే సభకు వచ్చాం

హైదరాబాద్: వెయ్యికోట్ల విద్యుత్ భారం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదివిన తర్వాత.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే తాము మళ్లీ సభకు వచ్చినట్లు ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాన్ని బయటకు పంపి ప్రజలపై భారం వేయాలని ప్రయత్నించారని, చంద్రబాబుకు గడ్డి పెట్టినా ఆయన తన పద్ధతి మార్చుకోలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. చంద్రబాబు పుణ్యమాని ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పే అవకాశం కూడా ఇవ్వరని.. సభ నుంచి పది నిమిషాల ముందే వాకౌట్ చేశామని ఆయన అన్నారు.
Back to Top