ప్రజల ఆత్మాభిమానాలు కాపాడేందుకు ఎందాకైనా సిద్ధం


ఢిల్లీ: ఆంధ్రుల ఆత్మాభిమానాలు కాపాడడం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని పార్టీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు సంఖ్యాపరంగా లం కొద్ది మందే ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాను హేళన చేస్తూ ముగిసిన కథ అంటూ చంద్రబాబు నాలుగేళ్లుగా మోసం చేస్తూ వస్తున్నారని వరప్రసాద్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చేసిన పోరాటాలతో ప్రజలంతా హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు రూట్‌ మార్చారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి 125 ఎంపీల మద్దతు ఉందన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే తపిస్తుందని, హోదాపై ఎన్ని రంగులు మార్చిందో ప్రజలంతా గమనిస్తుందన్నారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుని తిరిగే వ్యక్తి ఇన్ని మాటలు మార్చడం తగునా అని చంద్రబాబును ప్రశ్నించారు. 
Back to Top