‘మాది వైయస్సార్‌ కుటుంబం అని గర్వంగా చెప్పుకుందాం’

కదిరి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వస్తారు. వారి ద్వారా ప్రతి ఒక్కరూ వైయస్సార్‌ కుటుంబంలో చేరి మాది వైయస్సార్‌ కుటుంబం అని గర్వంగా చెప్పుకుందాం’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్ధారెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక దత్త ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ‘వైయస్సార్‌ కుటుంబం’పై పార్టీ బూత్‌ కన్వీనర్‌లకు సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గడప గడపకు వైయస్సార్‌’ కార్యక్రమంలో భాగంగా తాను ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం..ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు కళ్లారా చూశానన్నారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మళ్లీ తనతో పాటు ప్రతి కార్యకర్త అన్ని ఇళ్లకు తిరిగి ప్రతి ఒక్కరినీ వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములు చేర్చుకుంటామని తెలియజేశారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ సెల్‌ ఫోన్‌ ద్వారా 91210 91210 నెంబర్‌కు కాల్‌ చేస్తే వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా వైయస్సార్‌ కుటుంబంలో చేరి, పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలియజేశారు.

చంద్రబాబు అబద్దాలను తెలియజెపుతాం: ‘రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు మునుపు సుమారు 600 అబద్దపు హామీలిచ్చారు. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం అన్నారు..అలా ఇవ్వని పక్షంలో నెలకు రూ 2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. కానీ ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. ఇలా నిరుద్యోగులనే కాకుండా ఉద్యోగులను, డ్వ్రాక్రా అక్కచెల్లెమ్మలను, రైతులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసగించారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజెబుతాం..మా పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తాం’ అని డా.సిద్దారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల కన్వీనర్లు, బూత్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top