చేయి చేయి కలుపుదాం... టీడీపీని మట్టికరిపిద్దాం

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మనమంతా చేయి.. చేయి కలిపి భూదందాలకు పాల్పడే టీడీపీ వారిని మట్టికరిపించాలని వైయస్‌ఆర్‌ సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. విశాఖ నగరమా.. విషాద నగరమా అనే చందంగా నగర పరిస్థితి దిగజారిందన్నారు. మహాధర్నా ప్రాంగణం వద్ద ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీకి చందాగా అధికారులు భూములు అప్పగించి చాపకింద నీరుగా రికార్డులు తారుమారు చేశారన్నారు. విశాఖలో జరుగుతున్న తంతుపై ఏకరువు పెడుతున్నా.. టీడీపీకి ఇప్పటి వరకు కనువిప్పు జరగడం లేదన్నారు. ఎక్కడ చూసినా భూముల స్కాములేనని మండిపడ్డారు. మనందరికీ భరోసా ఇచ్చేందుకు విశాఖను విశాలనగరంగా మార్చే బాధ్యత నాది అని మన నాయకుడు వైయస్‌ జగన్‌ ధర్నా చేపట్టారన్నారు. అధికారంలోకి వచ్చాక వైయస్‌ జగన్‌ భూములు తిన్నవారి పనిపడతారని హెచ్చరించారు. 
Back to Top