రాజధానికి వ్యతిరేకం కాదు.. రాజధాని మోసాలకు వ్యతిరేకం

హైదరాబాద్) రాజధానికి
తాము వ్యతిరేకం కాదని, రాజధాని మోసాలకు వ్యతిరేకమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల
రామక్రిష్ణారెడ్డి స్పష్టం చేశారు. మొద‌టి నుంచి
కూడా వైఎస్సార్‌సీపీ స్ప‌ష్టంగా త‌న వైఖ‌రిని తెలియ‌జేసింద‌ని ఆయన అన్నారు. రైతుల్నీ, పేద‌లను ఏ ర‌కంగా మోసం చేస్తున్నారనేది అందరికీ తెలుసని ఆయన అన్నారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు.
 సీఆర్‌డీఏ
అంటే క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆథారిటీ కాదని,  చంద్ర‌బాబు రియ‌ల్
ఎస్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆథారిటీ అని మా పార్టీ ఎప్పుడు చెబుతుంద‌ని, అదే ఇప్పుడు  నిజ‌మైంద‌న్నారు.  సీఆర్‌డీఏ తరపున సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంటామని, వాటిని రాష్ట్ర
ప్రయోజనాలకు వాడుకొంటామని మంత్రిమండలి లోచెప్పారని గుర్తు చేశారు. కానీ ప్ర‌స్తుతం సింగపూర్ ప్ర‌భుత్వ కంపెనీతో కాకుండా అక్క‌డున్న
ఎస్అండ్ఎస్, సెమ్‌కార్ప్ అనే రెండు ప్రైవేట్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్నార‌ని
ఆరోపించారు. ఇలా ప్రైవేట్ కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకుంటూ రైతులు, ప్ర‌జ‌ల్ని
సీఆర్‌డీఏ పేరుతో మోసం చేస్తోంద‌ని రామక్రిష్ణారెడ్డి మండిప‌డ్డారు. 

Back to Top