వైయస్‌ జగన్‌ వెన్నంటే ఉంటాం

మాచవరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే ఉంటూ, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి వి. అనిల్‌ కుమార్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  జంగా మాట్లాడుతూ.. ప్రజల్లో అసంతృప్తి భావన కలిగించేందుకు పచ్చ పత్రికలు తాను వేరొక పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిలో ఏమాత్రం నిజం లేదని , వాస్తవానికి విరుధ్దంగా ఉన్న ఆ వార్తను ఖండించారు. టీడీపీ నేతలు ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 15వ తేదీన పిడుగురాళ్ళ లో చేపట్టిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో జరిగిన ర్యాలీని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు ప్రాంతం దివంగత నేత  వైయస్‌ఆర్‌ అభిమానాన్ని చూరగొన్న ప్రాంతమని, ఆయన ద్వారా పల్నాటి ప్రజలు అనేక ప్రజా సంక్షేమ పధకాలను పొందారని గుర్తు చేశారు. 

హోదాపై మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 
రాష్ట్ర విభజన సమయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిన టీడీపీ, విభజన అనంతరం రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పాయని జంగా కృష్ణమూర్తి విమర్శించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా 15 సంవత్సరాల పాటు హోదా కావాలని డిమాండ్‌ చేసిన వారు నేడు హోదా సంజీవిని కాదనడం ప్రజల్ని మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. హోదా వల్ల రాష్ట్రానికి  కలిగే ప్రయోజనాలను దక్కుండా చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో నిధులు తీసుకువచ్చి, తమ పార్టీ నాయకుల జేబులు నింపుకోవడానికి  ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు.  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్రజలు నినదిస్తుంటే , దాన్ని అణచివేసేందుకు ఉక్కు పాదం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో  తాత్కాలిక నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించుకు తీరతామని తెలియజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చౌదరి సింగరయ్య ,జిల్లా సంయుక్త కార్యదర్శి వి. అనిల్‌ కుమార్‌  ఎంపీటీసీ కె. చంద్రశేఖర్‌ రావు, సేవాదళ్‌ అధ్యక్షులు జానీ, విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కె, చిన రామయ్య , మండల నాయకులు రాము , అంజి , ప్రసాదు, వెంకటస్వామి , మద్దు రంగ పాల్గొన్నారు. 
Back to Top