వైయస్ జగన్ వెంటే మేము..!

() ప్రలోభాలు పెడుతున్నారు

()కేసులు అంటూ
బెదిరిస్తున్నారు

()వైయస్ జగన్ ను వీడేది
లేదు

() పచ్చ పత్రికలు తప్పుడు
ప్రచారం మానుకోవాలన్న ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి

హైదరాబాద్) తెలుగుదేశంలోకి
వస్తే డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని, లేదంటే కేసులు పెడతామని
బెదిరిస్తున్నారని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్
రెడ్డి వెల్లడించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాలుగా బెదిరించినా వైయస్
జగన్ వెంటే ఉంటామని, వైయస్సార్సీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే
జైలుకి వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్
లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

          తెలుగుదేశం చేస్తున్న తప్పుడు పనుల మీద వైయస్సార్సీపీ పోరాటం
చేస్తోందని ఆయన అన్నారు. పనామా పత్రాల్లో వరుసగా చంద్రబాబు అనుచరుల పేర్లు బయటకు
వస్తున్నాయని ఆయన వివరించారు. హెరిటేజ్ డైరక్టర్ ప్రసాద్ పేరు బయటకు వచ్చిందని,
అంతకు ముందు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్ దేవగన్ పేరు పనామా పత్రాల్లో వచ్చిందని
ఆయన చెప్పారు. అనేక రకాల అవినీతి పనులు చేసి వేల కోట్ల రూపాయిలు
కొల్లగొట్టేస్తున్నారని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ అవినీతి సొమ్ములతో
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. ఆ అవినీతి సొమ్ముతో
వైయస్సార్సీపీ ని నాశనం చేసేందుకు తాపత్రయ పడుతున్నారని పేర్కొన్నారు.

          ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ముఖ్యం అని, అప్పుడే ప్రభుత్వాలు
బాధ్యతతో పనిచేస్తాయని ఆయన అన్నారు. తాము ఇంజనీరింగ్ చదువుకొని, వ్యాపారవేత్తగా
రాణించి రాజకీయాల్లోకి వచ్చామని ఆయన వివరించారు. వైయస్ జగన్ ఆశీస్సులతో
ఎమ్మెల్యేగా గెలిచామని, చివరిదాకా ఆయన వెంటే ఉంటామని రాంరెడ్డి ప్రతాప్ కుమార్
రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశంలోకి రావాలని, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ
పెట్టారని... లేదంటే మాత్రం అక్రమ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని వివరించారు.
ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టినా తాము వైయస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం
చేశారు. అక్రమ కేసుల్లో జైల్లో పెడితే అందుకు కూడా సిద్ధమేనని, వైయస్ జగన్ ను
వీడేది లేదని తేల్చి చెప్పారు. పచ్చ మీడియా పత్రికలు ఇటువంటి తప్పుడు ప్రచారాలు
మాని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడితే మంచిదని హితవు పలికారు. 

Back to Top